ఎపిడ్రిన్ అక్రమ తయారీ కేసులో ఆస్తుల అటాచ్

ABN , First Publish Date - 2022-03-15T22:25:35+05:30 IST

ఎపిడ్రిన్ అక్రమ తయారీ కేసులో రూ.1.61 కోట్ల ఆస్తులను ఈడీ

ఎపిడ్రిన్ అక్రమ తయారీ కేసులో ఆస్తుల అటాచ్

హైదరాబాద్‌: ఎపిడ్రిన్ అక్రమ తయారీ కేసులో రూ.1.61 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. నిందితులు నాగరాజు, సత్యనారాయణరాజుల ఆస్తులను అటాచ్ చూస్తూ ఈడీ చర్యలు తీసుకుంది. డీఆర్ఐ ఫిర్యాదుతో ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. అక్రమంగా ఎపిడ్రిన్ తయారుచేసి సంపాదించిన డబ్బులతో ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఈడీ గుర్తించింది. ఎపిడ్రిన్ విక్రయాలతో రూ.5.2 కోట్లు సంపాదించినట్లు ఈడీ తేల్చింది. తెలంగాణ, తమిళనాడులోని 16 ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.  

Updated Date - 2022-03-15T22:25:35+05:30 IST