ఘల్లుమన్న జానపం పులకించిన ప్రేక్షక హృదయం

ABN , First Publish Date - 2021-02-28T08:31:01+05:30 IST

అభినయ ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న సాంస్కృతికోత్సవాల్లో భాగంగా రెండవరోజు శనివారం సాయంత్రం జరిగిన జానపద నృత్యాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి.

ఘల్లుమన్న జానపం పులకించిన ప్రేక్షక హృదయం

 డప్పుకొట్టి దరువెయ్యనా.. డోలు కొట్టి అడుకెయ్యనా అంటూ

హోరెత్తించిన జానపదనృత్యాలు

 

తిరుపతి(కల్చరల్‌), ఫిబ్రవరి 27: అభినయ ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న సాంస్కృతికోత్సవాల్లో భాగంగా రెండవరోజు శనివారం సాయంత్రం జరిగిన జానపద నృత్యాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. సంక్రాంతి సంబరాల్లో పల్లెప్రజలు ఆడుకునే సంప్రదాయ పల్లెపదాలతో చిన్నరోలు అభినయించిన తీరు అదరినీ అబ్బురపరిచాయి. ఇందులో నృత్య కళాకారుడు కొండా రవి నేతృత్వంలో డప్పు, కోలాటం, చెక్కభజనలు మరింత జోష్‌ పెంచాయి. 

తిరుపతికి చెందిన సత్యం జానపద కళాసంస్థ ఆధ్వర్యంలో చిన్నారులు శ్రీనయన, వర్షలహరి, యాశస్విని, దేవిశ్రీ, ఉష, ఇందుమతి, శ్రీవర్షిణి, కావ్యశ్రీ చేసిన నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. డప్పుకొట్టి దరువేయ్యనా అంటూ అదరగొట్టారు. రేణిగుంటకు చెందిన సంప్రదాయ నృత్య అకాడమీ ప్రదర్శించిన దొమ్మంఆట డోలు డోలు కొట్టినా డోలు కొట్టి గోల్‌మాల్‌ చేయనా అంటూ భానుకుమార్‌, శ్రావన్‌, కిరణ్‌, అద్రిత్‌, కావ్యశ్రీ, తేజోమయి భళా అనిపించారు. జతీస్‌ నృత్యాలయం శైలజారెడ్డి బృందం ప్రదర్శించిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విశ్వం విద్యాసంస్థల అధినేత తులసి, సుమతిరెడ్డి, తంజావూరు జగన్నాధరావు, విశ్వం విశ్వనాధరెడ్డి, అభినయ ఆర్ట్స్‌ బీఎన్‌ రెడ్డి కృళాబృందాలను అభినందించారు. 

విలువలకు అద్దంపట్టిన శ్రీకారం నాటిక 

 తిరుపతికి చెందిన శ్రీవిద్యుత్‌ కళాసమితి వారు ప్రదర్శించిన శ్రీకారం నాటిక మానవీయ విలువలకు అద్దంపట్టింది. చారు. డబ్బుకంటే అనుబంధాలే బరువెక్కువనే నేపథ్యంలో నాటిక అసాంతం నడుస్తుంది. ఇందులో జయచంద్ర, వాసుదేవాచారి, యశోద, మూర్తిరాజులు, ప్రధాన పాత్రలు పోషించారు. ఈ నాటికను భవానీప్రసాద్‌ రచించగా మూర్తిరాజు దర్శకత్వం వహించారు. కాకినాడకు చెందిన కేవీ రమణ అందించిన  సంగీతం నాటికకు ప్రాణం పోసింది. 

Updated Date - 2021-02-28T08:31:01+05:30 IST