Abn logo
Jun 18 2021 @ 01:05AM

జడ్పీ సీఈఓగా భాస్కర్‌రెడ్డి

అనంతపురం విద్య, జూన్‌ 17 : జిల్లా పరిషత్‌ సీఈఓగా భాస్కర్‌రెడ్డి నియమితులయ్యారు. అనంతపురం రూరల్‌ఎంపీడీఓగా పనిచేస్తున్న ఆయనను జడ్పీ సీఈఓగా నియమిస్తూ పంచాయతీరాజ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ గోపాలకృష్ణ ద్వివేదీ గురువారం జీఓ 333 విడుదల చేశారు. ఆయన ప్రస్తుతం అనంతపురం రూరల్‌ మం డలం ఎంపీడీఓగా పనిచేస్తున్నారు. గతంలో గార్లదిన్నె, ఆత్మకూరు, ధర్మవరం తదితర మండలాల్లో పనిచేశారు. ఇక్కడ పనిచేస్తున్న జడ్పీ సీఈఓ శోభాస్వరూపరాణి దీర్ఘకాలిక సెలవులో వెళ్లడంతో జడ్పీ డిప్యూటీ సీఈఓగా పనిచేస్తున్న శ్రీనివాసులును ఎఫ్‌ఏసీ జడ్పీ సీఈఓగా కలెక్టర్‌ ఇటీవలే నియమించారు. ఈ క్రమంలో కొత్త జడ్పీ సీఈఓగా భాస్కర్‌ రెడ్డిని నియమించారు. గతంలో ఇక్కడ సీఈఓగా ఉన్న శోభాస్వరూపరాణిని ప్రభుత్వానికి రిపోర్టు చేసుకోమని జీఓలో పేర్కొన్నారు. రెండు, మూడు రోజుల్లో ఆయన సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.