Abn logo
Feb 27 2021 @ 00:54AM

అక్షర యోధుడికి కన్నీటి వీడ్కోలు

సింగమనేని అంతిమయాత్రలో పాల్గొన్న కవులు, రచయితలు, మేధావులు, ప్రముఖులు, సీపీఎం నాయకులు, విద్యార్థులు తదితరులు

సింగమనేని అంతిమయాత్రకు భారీగా తరలివచ్చిన ప్రముఖులు, జనం

అనంతపురం టౌన్‌, ఫిబ్రవరి 26:  సాహితీ కెరటం, అనంత ప్రజాగొంతుక, రచయిత, కథా విమర్శకుడు సింగమనేని నారాయణకు అనం త కన్నీటి వీడ్కోలు పలికింది. ఆయన అంతిమయాత్ర అశ్రునయనాల నడుమ సాగింది. శుక్రవారం శ్రీనివాసనగర్‌లోని ఆయన నివాసం నుంచి ఉదయం ప్రారంభమైన అంతిమయాత్ర రైల్వేస్టేషన్‌, క్లాక్‌టవర్‌, సప్తగిరి సర్కిల్‌, తెలుగుతల్లి విగ్ర హం, అంబేడ్కర్‌ బ్రిడ్జి, జాతీయ రహదారి మీదుగా కనగానపల్లి వరకు సాగింది. నగరంలో రైల్వేస్టేషన్‌, సప్తగిరి సర్కిల్‌, తెలుగుతల్లి విగ్రహం వద్ద ఎస్‌ఎ్‌ఫఐ, ఐద్వా సంయుక్తాధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు హాజరై, నివాళులర్పించారు. అశేష జనవాహిని నడుమ సింగమనేని భౌతికకాయాన్ని ప్రత్యేక వాహనంలో కనగానపల్లి వద్దగల వారి తోట వరకూ ఊరేగింపుగా తీసుకెళ్లారు. సాహితీవేత్తలు, ప్రజాసంఘాల నేతలు, బంధుమిత్రులు, అభ్యుదయ వాదులు బరువెక్కిన హృదయంతో అం తిమయాత్ర వాహనం ముందు నడుస్తూ, దారి పొడవునా నినాదాలు చేశారు. కనగానపల్లి వద్ద సింగమనేని సొంత తోటలో ఆయన భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు శ్రీనివాసరావు, మాజీ ఎంపీ దరూరు పుల్లయ్య, సీపీఎం రాష్ట్ర నేత ఓబులు, జి ల్లా ఉత్తర, దక్షిణప్రాంత కార్యదర్శులు రాంభూపాల్‌, ఇంతియాజ్‌, నేతలు నల్లప్ప, నాగేంద్రకుమార్‌, బాలరంగయ్య, ఐద్వా సావిత్రి, సీపీఐఎంఎల్‌ పెద్దన్న, సూర్యసాగర్‌, శ్రీహరి, సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ ఇండ్ల ప్రభాకర్‌రెడ్డి, నాగరాజు, మానవహక్కుల వేదిక నాయకుడు ఎస్‌ఎం బాషా, రచయితలు జెట్టి జయరాం, రాఘవయ్య, టీవీ రెడ్డి, డాక్టర్‌ ప్రగతి, పిల్లా కుమారస్వామి, కొత్తపల్లి సురేష్‌, అ ప్పిరెడ్డి హరినాథరెడ్డి, ప్రజ్ఞా సురేష్‌, గంగిరెడ్డి అశ్వత్థరెడ్డి, అక్షరమాలి సురేష్‌, గుత్తా హరిసర్వోత్తమనాయుడు, కంబదూరి షేక్‌ నబిరసూల్‌, సింగమనేని అభిమానులు, మేధావులు, ప్రజలు పెద్దసంఖ్యలో హాజరై, తుది వీడ్కోలు పలికారు. అనంతరం అక్క డే ఏర్పాటు చేసిన సంతాప సభలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ సింగమనేని వంటి గొప్ప రచయితను సమాజం కోల్పోవటం బాధాకరమన్నారు. సాహిత్య, విద్య, శ్రామిక, కార్మిక, కర్షక రంగాలకు తీరని లోటు అన్నారు. మార్క్సిస్టు భావజాలానికి అంకితమైన ఆదర్శజీవి సింగమనేని అని కొనియాడారు. దేశంలో జరుగుతు న్న రైతు, విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమాలు సింగమనేని ఆశించిన మరో ప్రపంచంవైపు నడుస్తున్న దశలో ఆయన భౌతికంగా లేకపోవడం ప్ర జాతంత్ర, వామపక్ష ఉద్యమానికి తీరనిలోటన్నారు. పోరాటాలకు సాహిత్య తురుపు ముక్కను కోల్పోయామన్నారు. ఆయన ఆశయాన్ని సాధించటమే ఆయనకిచ్చే ఘనమైన నివాళి అనీ, ఆ మేరకు సీపీఎం కృషి చేస్తుందని తెలిపారు.


అశ్రునయనాల నడుమ సింగమనేని అంత్యక్రియలు

కనగానపల్లి, ఫిబ్రవరి 26: సాహితీవేత్త సింగమనేని నారాయణ అంత్యక్రియలు అభిమానుల అశ్రునయనాల నడుమ కనగానపల్లిలో నిర్వహించారు. సింగమనేని నారాయణ (78) అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. అయన స్వగ్రామం బండమీదపల్లి. కనగానపల్లిలో వివాహం చేసుకున్నారు. అక్కడే ఆయనకు పొలాలుండటంతో ఆయన అంత్యక్రియలకు తోటలో ఏర్పాటు చేశారు. శుక్రవారం అనంతపురం నుంచి భారీ ర్యాలీగా కనగానపల్లికి ఆయన పార్థివదేహాన్ని తీసుకొచ్చారు. ప్రజాసంఘాలు, సాహితీ వేత్తలు, కవులు, సీపీఎం, సీపీఐ నాయకులతో పాటు ఆయన కుటుంబికులు పెద్దఎత్తున హాజరై, అంత్యక్రియులు చేపట్టారు. అంత్యక్రియుల అనంతరం కమ్యూనిస్టు పార్టీ జెండాను కప్పి, ‘సింగమనేని నారాయణ అమర్‌ రహే’ అంటూ నినదించారు. అంతకు ముందు ఆయన మృతికి పలు సంఘాల నాయకులు రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు.

Advertisement
Advertisement
Advertisement