‘వాహనమిత్ర’ దరఖాస్తుకు మరో అవకాశం

ABN , First Publish Date - 2021-06-18T06:36:41+05:30 IST

వైఎ్‌సఆర్‌ వాహన మిత్ర పథకానికి అర్హులైన లబ్ధిదారులు దరఖా స్తు చేసుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చినట్లు అనంతపురం ఆర్టీఓ సుధాకర్‌రెడ్డి గురువారం ఒక ప్రకట నలో తెలిపారు.

‘వాహనమిత్ర’ దరఖాస్తుకు మరో అవకాశం

అనంతపురం వ్యవసాయం, జూన్‌ 17  : వైఎ్‌సఆర్‌ వాహన మిత్ర పథకానికి అర్హులైన లబ్ధిదారులు దరఖా స్తు చేసుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చినట్లు అనంతపురం  ఆర్టీఓ సుధాకర్‌రెడ్డి గురువారం ఒక ప్రకట నలో తెలిపారు. ఈనెల 15వతేదీన సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి చేతుల మీదుగా మూడో విడతలో జిల్లాలోని 12420 మంది ఆటో, ట్యాక్సీ, మ్యాక్స్‌ క్యాబ్‌ వాహనదారులకు రూ.10వేలు చొప్పున జమ చేశారన్నారు. ఇంకా ఎవరైనా అర్హులుంటే వారికి ఆర్థిక సాయం చేసేందుకు వచ్చే నెల 15వతేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు  అవకాశం కల్పించినట్టు తెలిపారు. 


సెప్టెంబరు 30 దాకా వాహన రికార్డుల గడువు పొడిగింపు 

అనంతపురం వ్యవసాయం, జూన్‌ 17 :  డ్రైవింగ్‌ లైనెన్స్‌, ఆర్‌సీ, ఎఫ్‌సీ, పొల్యూషన్‌, ఇతర రకాల పర్మిట్లకు సంబంధించి వాహన రికార్డుల గడువును ఈ ఏడాది సెప్టెంబరు నెలాఖరు వరకు పొడిగించారు. ఈ మేరకు కేంద్ర రహదారులు, రవాణా శాఖ గురువారం అధికారికం గా ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిని నియం త్రించేందుకు గతేడాది మార్చి నుంచి పలు దఫాలు గా గడువును పొడిగిస్తూ వచ్చారు. ఇదివర కు ఈ నెలాఖరువరకు గడువు విధించారు. కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో మరో అవకాశం ఇచ్చారు. గతేడాది ఫిబ్ర వరి 1 తర్వాత కాలం చెల్లిన డ్రైవింగ్‌ లైనెన్స్‌, ఆర్‌సీ, ఎఫ్‌సీ, పొల్యూషన్‌, ఇతర రకాల ఫర్మి ట్లకు సంబంధించి వాహన రికార్డులను రెన్యువల్‌ చేసుకు నేందుకు సెప్టెంబరు నెలాఖరు వరకు అవకాశం ఇచ్చారు. జిల్లాలో 1.20 లక్షల వాహనాలున్నాయి. ఇందులో 37వేల వాహనాలకు  సంబంధించి కాలం చెల్లిన వివిధ రకాల రికార్డులుంటా యని ఆర్టీఏ అధికారుల అంచనా. వీటన్నింటికీ ప్రభుత్వం తాజాగా నిర్దేశించిన గడువు వరకు రెన్యువల్‌కు అవకాశం ఉంటుందని అనంతపురం ఆర్టీఓ సుఽధాకర్‌రెడ్డి పేర్కొన్నా రు. ఈ అవకాశాన్ని వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Updated Date - 2021-06-18T06:36:41+05:30 IST