648 మందికి కరోనా టీకా

ABN , First Publish Date - 2021-01-24T07:25:49+05:30 IST

జిల్లాలో కరోనా టీకా ప్రక్రియ కొనసాగింది. శనివారం జిల్లాలో 41 కేంద్రాల్లో టీకా వేశారు. 2541 మంది హాజరు కావాల్సి ఉండగా 648 మంది టీకా వేయించుకున్నారు.

648 మందికి కరోనా టీకా

వారంలో లక్ష్యం 24019 కాగా.. 10352 మందికే వ్యాక్సిన్‌

40 శాతంలోపే జిల్లాలో వ్యాక్సినేషన్‌

అనంతపురం వైద్యం, జనవరి 23: జిల్లాలో కరోనా టీకా ప్రక్రియ కొనసాగింది. శనివారం జిల్లాలో 41 కేంద్రాల్లో టీకా వేశారు. 2541 మంది హాజరు కావాల్సి ఉండగా 648 మంది టీకా వేయించుకున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి కరోనా టీకా వేస్తున్నారు. తొలి విడతలో ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ అయిన వైద్యులు, వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలకు టీకా వేయాలని నిర్ణ యించారు. 30747 మందికి వేసేందుకు ఏర్పాట్లు చేపట్టారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి వైద్య వర్గాలు, అంగన్‌వాడీ కార్యకర్తలు పెద్దగా ఆసక్తి చూపట్లేదని తెలుస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం వారంలో 24019 మందికి వ్యాక్సిన్‌ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 10352 మంది మాత్రమే టీకా వేయించుకున్నారు. ఈ లెక్కన 40 శాతంలోపే టీకా వేసుకున్నారు. అది కూడా వైద్య వర్గాలు, అంగన్‌వాడీలు టీకాకు దూరంగా ఉండ టం చర్చనీయాంశంగా మారింది.


కొత్తగా 11 కరోనా కేసులు

జిల్లాలో శనివారం కొత్తగా 11 కరోనా పాజిటివ్‌ కేసులు నమోద య్యాయి. ధర్మవరం 5, అనంతపు రం 4, చిలమత్తూరు మండలంలో 2 కేసులు నిర్ధారణ అయ్యాయి. గడచిన 24 గంటల్లో వైరస్‌తో ఎవ రూ మరణించలేదు. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు బాధితుల సంఖ్య 67604కు చేరింది. అందులో 66952 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. 598 మంది ప్రాణాలు కోల్పోయా రు. ప్రస్తుతం 54 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

Updated Date - 2021-01-24T07:25:49+05:30 IST