Abn logo
May 15 2021 @ 01:15AM

వ్యాక్సిన్‌ వచ్చేసిందోచ్‌..

కొవిషీల్డ్‌ 27 వేలు.. కోవాగ్జిన్‌ 6 వేలు.. నేడు రెండో డోసు వారికే టీకా..

అనంతపురం వైద్యం, మే14: జిల్లాకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ వచ్చేసింది. కొవిషీల్డ్‌ 27 వేలు, కోవాగ్జిన్‌ 6 వేల డోసులు పంపారు. వాటిని పంపిణీ చేయడానికి జిల్లా వైద్య శాఖ చర్యలు చేపట్టింది. వ్యాక్సిన్‌ వేసే కేంద్రాలకు శుక్రవారం పంపిణీ చేశారు. వచ్చిన వ్యాక్సిన్‌ను జిల్లాలో నిర్ణయించిన కేంద్రాల్లో పంపిణీ చేపడుతున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కామేశ్వరప్రసాద్‌, డీఐఓ గంగాధర్‌రెడ్డి తెలిపారు. రెండో డోసు వారికి మాత్రమే శనివారం వ్యాక్సిన్‌ వేస్తామన్నారు. ఇప్పటికే ఆ మేరకు లబ్ధిదారులకు సిబ్బంది ద్వారా సమాచారం పంపామన్నారు.

Advertisement