ఇక.. కొవిషీల్డ్‌ డోసుల అంతరం 84 రోజులు.. అర్ధరాత్రి నుంచే అమల్లోకి..

ABN , First Publish Date - 2021-05-15T06:40:47+05:30 IST

కొవిషీల్డ్‌ టీకా రెండు డోసుల మధ్య వ్యవధిని మరింత పెంచారు. తొలుత 28 రోజుల్లోపు రెండో డోసు వేసుకోవాలని నిబంధన పెట్టారు.

ఇక.. కొవిషీల్డ్‌ డోసుల అంతరం 84 రోజులు.. అర్ధరాత్రి నుంచే అమల్లోకి..

అనంతపురం వైద్యం, మే14: కొవిషీల్డ్‌ టీకా రెండు డోసుల మధ్య వ్యవధిని మరింత పెంచారు. తొలుత 28 రోజుల్లోపు రెండో డోసు వేసుకోవాలని నిబంధన పెట్టారు. ఆ తర్వాత దానిని 6 నుంచి 8 వారాల్లోపు వేసుకోవాలని గడువు పెంచారు. ఇప్పుడు మూడోసారి మళ్లీ కొవిషీల్డ్‌ రెండో డోసు గడువు మళ్లీ పెంచారు. ఇప్పుడు రెండో డోసు టీకా వేసుకునే గడువు 84 రోజులకు పెంచారు. ఇది శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుందని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు వెల్లడించారు. కొవిన్‌ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి 84 రోజుల్లోపు వ్యాక్సిన్‌ రాదని తెలియజేశారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న స్లాట్లు మొత్తం రద్దవుతాయన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కలెక్టర్‌ కోరారు. 

Updated Date - 2021-05-15T06:40:47+05:30 IST