ఏమి లెక్కో

ABN , First Publish Date - 2021-06-18T06:41:50+05:30 IST

ఉపాధి పనుల్లో చిత్రవిచిత్రాలు జరుగుతున్నాయి. పనిచేయకున్నా బిల్లే అన్న విధంగా పరిస్థితులు నెలకొన్నాయి.

ఏమి లెక్కో
కురుగుంట సమీపంలో పనిచేస్తున్న కూలీలు

ఏమి లెక్కో

పనిచేయకున్నా బిల్లులు

మామూళ్లు ఇచ్చిన వారికి అధిక బిల్లులు

ఫీల్డ్‌ అసిస్టెంట్ల మాయాజాలం

 ఉపాధి పనుల్లో వాటాల బాగోతం.!

అనంతపురంరూరల్‌, జూన్‌17: ఉపాధి పనుల్లో చిత్రవిచిత్రాలు జరుగుతున్నాయి. పనిచేయకున్నా బిల్లే అన్న విధంగా పరిస్థితులు నెలకొన్నాయి. జాబ్‌కార్డు ఉంటే చాలు.. ఖాతాలోకి బిల్లు సొమ్ము పడిపోతోంది. దీనికి తోడు మామూళ్లు ఇచ్చిన వారికి మరికొంత అదనంగా బిల్లు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నా యి. క్షేత్రస్థాయిలో ఫీల్డ్‌ అసిస్టెంట్లే ఇం దుకు ప్రధాన సూ త్రధారులుగా నిలుస్తున్నారు. దీంతో రోజూ పనులు చేసే కూలీలు లబోదిబోమంటున్నారు. ఇందు కు ఇటీవల మండలంలోని ఓ గ్రామంలో జరిగిన సంఘటనలే నిదర్శనం. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే క్షేత్రస్థాయిలో  అక్రమాలు జరుగుతున్నాయని కూలీలు వాపోతున్నారు. 


మండలంలో 3 వేల మందికి పైగా కూలీలు

అనంతపురం రూరల్‌ మండలంలో 26 పంచాయతీలు ఉండగా.. 21 పంచాయతీల్లో ఉపాధి పనులు జరుగుతున్నాయి.  3600 మంది కూలీలు పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు 9 మందివి వంద రోజులు పనిదినాలు పూర్తి అయినట్లు అధికారుల చెబుతున్నారు. కాగా గతంలో సంబంధిత ఉన్నతాధికారులు 10 వేలు లక్ష్యం కాగా..5,400మందికి పనికల్పించారు. అంతకు మినహా మండల అధికారులు లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. ప్రస్తుతం పనిచేసే వారిలోనూ పనులకు రానివారి సంఖ్య పదుల సంఖ్యలో ఉండటం గమనార్హం. ఈ విషయంలో ఇటీవల మండలంలోని చిన్నంపల్లిలో కూలీలు ఫీల్డ్‌ అసిస్టెంట్‌తో వాగ్వాదానికి దిగారు. పనులకు రాని వారికి కూడా బిల్లు పెట్టి.. తమకు బిల్లు తక్కువ వచ్చేలా చూస్తున్నారని గొడవపడ్డారు. ఇలాంటి ఘటనలు ఉపాధి పను ల వద్ద తరచూ జరుగుతున్నాయి. 


పనులకు రాకున్నా బిల్లులు..

ప్రస్తుతం పనులకు రాకున్నా బిల్లులు ఖాతాల్లోకి జమ అవుతున్నాయన్నా విమర్శలున్నాయి. బిల్లులు ఖాతాల్లోకి పడగానే ఉపాధి సిబ్బంది, కూలీలు నీకింత నాకింత అని వాటా లు వేసుకుని పంచుకుంటున్నారన్న వాదనలున్నాయి. ఈ విషయం ఉపాధి పనుల వద్ద బహిరంగంగానే కూలీలు చెప్పుకొస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం మండలంలో 3600 మంది ఉపాధి పనులకు వస్తున్నట్లు చెబుతున్నాయి. అందుకు అనుగుణంగానే ఫీల్డ్‌ అసిస్టెం ట్లు మస్టర్లు నింపుతున్నారు. నిజానికి ఈ సంఖ్య సగం కూడా ఉండటం లేదని పలువురు చెబుతున్నారు. ఈ అక్రమాల్లో సంబంధిత అధికారులకు, నాయకులకు వాటాలు వెళ్తున్నాయన్న విమర్శలున్నాయి.  


అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటాం : చంద్రకళ, ఏపీఓ

పనులకు రాకున్నా.. ఎవరికీ బిల్లులు చెల్లించడం లేదు. అలాంటి సంఘటనలు జరిగినట్లు మా దృష్టికి రాలేదు. ఎవరైనా అలా చేస్తున్నట్లు మా దృష్టికి తీసుకువస్తే చర్య లు తీసుకుంటాం. 

Updated Date - 2021-06-18T06:41:50+05:30 IST