డూప్‌ కేలండర్‌

ABN , First Publish Date - 2021-06-20T06:31:34+05:30 IST

atp ముఖ్యమంత్రి జగన్‌ విడుదల చేసినది జాబ్‌ కేలండర్‌ కాదనీ, డూప్‌ కేలండర్‌ అని తెలుగుయువత మండిపడింది.

డూప్‌ కేలండర్‌
జాబ్‌ కేలండర్‌పై నిరసన తెలుపుతున్న తెలుగుయువత నాయకులు

జాబ్‌ కేలండర్‌పై తెలుగుయువత నిరసన

అనంతపురం వైద్యం/క్లాక్‌టవర్‌, జూన్‌ 19: ముఖ్యమంత్రి జగన్‌ విడుదల చేసినది జాబ్‌ కేలండర్‌ కాదనీ, డూప్‌ కేలండర్‌ అని తెలుగుయువత మండిపడింది. శనివారం ఈ జాబ్‌ కేలండర్‌పై తెలుగుయువత రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి నారాయణస్వామి నేతృత్వం లో జిల్లా కేంద్రంలో వినూత్న నిరసన సా గించారు. ప్రభుత్వ మోసం వివరిస్తూ నినాదాలు చేస్తూ నిరసన సాగించారు. ముఖ్యమంత్రి ప్రకటించిన జాబ్‌ కేలండర్‌ ప్రతులను దహనం చేసి, నిరసన తెలిపారు. అ నంతరం నారాయణస్వామి మాట్లాడుతూ జాబ్‌ కేలండర్‌ అంటూ నిరుద్యోగులకు సీ ఎం చెవిలో పూలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వా త ఉద్యోగ అవకాశాలు కల్పించలేదన్నారు. అన్ని ఉద్యోగాలు ఇచ్చాం.. ఇన్ని నియామకాలు చేశామంటూ ప్రకటించుకోవటం సిగ్గుచేటన్నారు. ఉద్యోగాల విప్లవం అంటూ సీఎం పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారనీ, తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలుగుయువత నా యకులు వేలూరు నవీన్‌, మద్దినేని కృష్ణ, బొమ్మినేని శివ, చల్లానాయుడు, నాగేంద్ర, రాప్తాడు గణేష్‌, మద్దుకూరి వెంకట్‌, ప్రశాంత్‌, రాహుల్‌, సోహేల్‌, రాజేష్‌, సుధా, టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ రాజశేఖర్‌, టీడీపీ నాయకులు రాగే మురళి, పూల నారాయణస్వామి పాల్గొన్నారు.


ప్రచారార్భాటం

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రచారార్భాటాలు, సొంత డబ్బా కొట్టుకోవడానికి మాత్రమే ఉపయోగపడేలా జాబ్‌ కేలండర్‌ ఉందని ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్‌ విమర్శించారు. ఉద్యోగాల భర్తీ పేరుతో సీఎం జగన్‌ విడుదల చేసిన జాబ్‌ కేలండర్‌ ప్రతులను స్థానిక నీలం రాజశేఖర్‌రెడ్డి భవనం ఆవరణలో ఏఐఎ్‌సఎఫ్‌ నాయకులు దహనం చేసి, నిరసన వ్యక్తం చేశారు. మనోహర్‌ మాట్లాడు తూ ఉద్యోగాల నోటిఫికేషన్‌ పేరుతో అరచేతిలో వైకుంఠం చూపించి, నిరుద్యోగు యువతను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ శాఖల్లో లక్షల్లో పోస్టులు ఖాళీగా ఉంటే జాబ్‌ కేలండర్‌లో మాత్రం వందల్లో చూపారని ఆరోపించారు. నోటిఫికేషన్‌ అంతా బోగస్‌ అని విమర్శించారు. కార్యక్రమంలో ఏఐఎ్‌సఎఫ్‌ నగర కార్యద ర్శి రమణయ్య, ఎస్కేయూ అధ్యక్షుడు నరసింహ, నగర నాయకులు హేమంత్‌, నారాయణస్వామి, అనిల్‌, బాలు, పవన్‌, రాఘవ, అరవింద్‌, నాగార్జున, సంజయ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-06-20T06:31:34+05:30 IST