పరిహారం అందించి.. రైతులను ఆదుకోండి..

ABN , First Publish Date - 2021-06-20T06:34:19+05:30 IST

పంటలు నష్టపోయిన రైతులకు బీమా, పంటనష్ట పరిహారం అందించి, ఆదుకోవాలని టీడీపీ నేతలు విజ్ఞప్తి చేశారు.

పరిహారం అందించి.. రైతులను ఆదుకోండి..
డీర్వోకు వినతి పత్రం అందజేస్తున్న ఆలం, ఆదినారాయణ, శ్రీధర్‌చౌదరి, వెంకటశివుడు యాదవ్‌, బుగ్గయ్యచౌదరి తదితరులు

 టీడీపీ నేతలు  

అనంతపురం వైద్యం, జూన్‌ 19: పంటలు నష్టపోయిన రైతులకు బీమా, పంటనష్ట పరిహారం అందించి, ఆదుకోవాలని టీడీపీ నేతలు విజ్ఞప్తి చేశారు. శనివారం నాయకులు ఆలం నరసానాయుడు, తలారి ఆదినారాయణ, శ్రీధర్‌చౌదరి, బండారు ఆనంద్‌, పామిడి ప్రభాకరచౌదరి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు బుగ్గయ్యచౌదరి, వెంకటశివుడుయాదవ్‌, అనంత పార్లమెంటు తెలుగురైతు ప్రధాన కార్యదర్శి యుగంధర్‌, జిల్లా వాణిజ్య విభాగ నాయకుడు చక్కా నాగేంద్ర తదితరులు రైతుల ఆవేదనన తెలియజేయడానికి కలెక్టరేట్‌కు వెళ్లారు. అక్కడ కలెక్టర్‌ అందుబాటులో లేకపోవడంతో డీఆర్వోను కలిశారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ 2018తోపాటు గతేడాదికి సంబంధించిన పంటనష్ట పరిహారం రైతులకు అందలేదన్నారు. కరువు జిల్లా రైతులు ఖరీఫ్‌ ప్రారంభం కావడంతో విత్తనం వేయడానికి అవస్థలు పడుతున్నారన్నారు. దాదాపు రెండేళ్లకు సంబంధించి రూ.2వేల కోట్లు రైతులకు పంటనష్టం సాయం అందించాల్సి ఉందన్నారు. వెంటనే బీమా, పంటనష్ట పరిహారం విడుదల చేసి, అనంత అన్నదాతలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు.

Updated Date - 2021-06-20T06:34:19+05:30 IST