అన్నదాతలకు అండగా టీడీపీ

ABN , First Publish Date - 2021-06-19T06:54:56+05:30 IST

కరువు జిల్లా అన్నదాతలకు తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యు డు, మాజీ మంత్రి కా లవ శ్రీనివాసులు పేర్కొన్నారు.

అన్నదాతలకు అండగా టీడీపీ

పంటనష్ట పరిహారం కోసం ప్రత్యక్ష పోరాటం

మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు

అనంతపురం వైద్యం, జూన్‌ 18: కరువు జిల్లా అన్నదాతలకు తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యు డు, మాజీ మంత్రి కా లవ శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన జిల్లా కేంద్రంలోని తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ   వర్షాభావంతో అనంత రైతులు వరుసగా పంటలు నష్టపో యి ఆర్థికంగా చితికిపోయారన్నారు. 2020 ఖరీ్‌ఫలో 12.26 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంట దెబ్బతినిందన్నారు. దాదా పు రూ.2500 కోట్లు అన్నదాతలు పంట పెట్టుబడుల రూ పంలో నష్టపోయినట్టు వివరించారు. అలాంటి రైతులను ఆదుకోవడానికి టీడీపీ పాలన 2014-19 మధ్యకాలంలో మూడు సార్లు పంటనష్టం అందించి ఆదుకున్నట్టు గుర్తు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పంటనష్ట పరిహారం సక్రమంగా అందడం లేదన్నారు. గత ఏడాది దాదాపు రూ.1000 కోట్లకు పైగా రైతులు పంటలు నష్టపో యారన్నారు. 10 లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా నష్ట పోయారన్నారు. ఆ రైతులకు పంటనష్టం అందించి ఆదు కోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 2021 ఖరీఫ్‌ సీజన్‌ మొదలైనా ఇప్పటిదాకా పంట నష్టం ఊసేలేదన్నారు. ఈ క్రాప్‌ సక్రమంగా చేయకపోవడం వల్ల పంటల బీమా కూడా రైతులకు ఆశించిన మేరా అందకుండా పోయిందన్నారు. గత ఏడాది ఖరీ్‌ఫలో పంటలు నష్టపోయిన 2.29 లక్షల మంది రైతుల కు ఇటీవల కేవలం రూ.212 కోట్లు అందించి ముఖ్యమం త్రి చేతులు దులుపుకున్నారన్నారు. 2018 ఖరీ్‌ఫలో పంట లు నష్టపోయిన రైతులకు రూ931.59 కోట్లు పరిహారం ఇంత వరకు అందలేదన్నారు. జిల్లాలోని 6.92 లక్షల మంది కరువు రైతులు ఈ పరిహారం కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారన్నారు. రెండేళ్లకు కలిపి సుమారు రూ.2 వేల కోట్లకు పైగా పరిహారం సొమ్మును రైతులకు చెల్లించాల్సి ఉందన్నారు. అందుకే అన్నదాతలకు న్యాయం చేయాలని టీడీపీ ప్రత్యక్ష పోరాటానికి శ్రీకారం చుడుతోందన్నారు. త్వరలో ఉద్యమాల ప్రణాళికను అధికా రికంగా ప్రకటిస్తామన్నారు. అన్నదాతలతో కలిసి ప్రభు త్వం దిగొచ్చి రైతులకు పరిహారం అందించేవరకు ఉద్య మం సాగిస్తామన్నారు.

Updated Date - 2021-06-19T06:54:56+05:30 IST