Abn logo
Sep 19 2021 @ 01:36AM

మహాత్మా! ఇదేమి అరాచకం

టవర్‌క్లాక్‌ సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న కాలవ, ప్రభాకరచౌదరి, ఆలం ఇతర నేతలు, శ్రేణులు..

గాంధీ విగ్రహం వద్ద టీడీపీ నిరసన

హాజరైన మాజీమంత్రి కాలవ, ప్రభాకరచౌదరి, శ్రేణులు

ప్రజాస్వామ్యం, పోలీసు విలువలపై దాడిగా అభివర్ణించిన కాలవ

అనంతపురం వైద్యం, సెప్టెంబరు 18: ‘మహాత్మా! ఆంధ్రప్రదేశలో ఇదేమి ఆటవిక పాలన’ అంటూ తెలుగు తమ్ముళ్లు జాతిపిత గాంధీ వి గ్రహం ఎదుట మొర పెట్టుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇంటిపై అధికార పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్‌.. వైసీపీ గూండాలను వెంటపెట్టుకొని దాడికి దిగడంపై శనివారం జిల్లా కేంద్రంలో టీడీపీ వినూత్న నిరసన చేపట్టింది. మాజీ మంత్రి, పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు, అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకరచౌదరి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు ఆలం నరసానాయుడు, తలారి ఆదినారాయణ, రామమోహన చౌదరితోపాటు పెద్దఎత్తున టీడీపీ నేతలు, శ్రేణులు పాల్గొన్నారు. పెద్దఎత్తున పోలీసులు ఈ నిరసనను పర్యవేక్షిస్తూ తీవ్రస్థాయిలో హెచ్చరికలు చేస్తూ వెంట నడిచారు. అయినా తమ్ముళ్లు ర్యాలీగా టవర్‌క్లాక్‌ సమీపంలోని గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ గాంధీ విగ్రహం దగ్గర కూర్చుని, ‘ఇదేమి రాజ్యం? దోపిడీ రాజ్యం, ఆటవిక రాజ్యం, సీఎం డౌనడౌన, ఎమ్మెల్యే జోగిరమేష్‌ ఖబడ్డార్‌’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. గంటపాటు కొనసాగించారు. అనంతరం దాడికి పాల్పడిన ఎమ్మెల్యే జోగి రమేష్‌ దిష్టిబొ మ్మ ను దహనం చేయడానికి టీడీపీ శ్రేణులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, తమ్ముళ్ల మధ్య తోపులాట జరిగింది. ఇది కొంత ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు దిష్టిబొమ్మను తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ ఏ అర్హతతో ఎమ్మెల్యే జోగి రమేష్‌.. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఇంటి వద్దకు వెళ్లారని ప్రశ్నించారు. పదుల సంఖ్యలో వాహనాల్లో వెళ్లడానికి పోలీసులు ఎలా అనుమతించారని మండిపడ్డారు. పోలీసుల తీరు చూస్తే ఇది సీఎం జగన పోత్సాహంతోనే జరిగినట్లు అర్థ మవుతోందన్నారు. పోలీసులు శాంతిభద్రతలు కాపాడకుండా, వృత్తి ధర్మాన్ని వదిలి వైసీపీ కార్యకర్తల్లా పని చే స్తుండటం బాధాకరమన్నారు. ఎంతో భద్రత కలిగిన చంద్రబాబు ఇంటిపై దాడి ప్రజస్వామ్యం, పోలీసు విలువలపై జరిగిన దాడిగా అభివర్ణించారు. దీనికి సీఎం జగనే సమాధానం ఇస్తారో, బాధ్యత వహిస్తారో ఆయనకే వదిలేస్తున్నామన్నారు. ప్రభాకరచౌదరి మాట్లాడుతూ భయానక వాతావరణం సృష్టించడానికే అధికార పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్‌.. ప్రతిపక్ష నేత ఇం టిపై దాడికి దిగారన్నారు. ఇది చాలా దుర్మార్గం, అనాగరికమన్నారు. ప్రధా ని మోదీ, కేంద్ర హోంమంత్రి అమితషా.. రాష్ట్రంలో అరాచకాలపై స్పందించాలనీ, ఈ దాడిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డి మాండ్‌ చేశారు. నిరసనలో తెలుగుమహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వప్న, నేతలు మోరేపల్లి మల్లికార్జున, దేవళ్ల మురళి, సరిపూటి రమణ, మారుతీగౌడ్‌, వెంకటే్‌షగౌడ్‌, గుర్రం నాగభూషణం, డిష్‌ నాగరాజు, రఘునాథ్‌, గో పాల్‌గౌడ్‌, రాయల్‌ కొండయ్య, డేరంగుల కృష్ణమూర్తి, గంగవరం బుజ్జి, నరసింహులు, మార్కెట్‌ ప్రకాష్‌, పూలబాషా, మణి రవి, బొమ్మినేని శివ, తెలుగు మహిళలు విజయశ్రీ, సరళ, జానకి, మణెమ్మ, శివబాల పాల్గొన్నారు.

దిష్టిబొమ్మ దహనంపై పోలీసులు, టీడీపీ శ్రేణులు తోపులాట