ఎన్నికల విధుల నుంచి పట్టణ సీఐ తొలగింపు

ABN , First Publish Date - 2021-01-23T06:47:55+05:30 IST

పట్టణ సీఐ తేజమూర్తిని ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది.

ఎన్నికల విధుల నుంచి పట్టణ సీఐ తొలగింపు

తాడిపత్రి, జనవరి 22 : పట్టణ సీఐ తేజమూర్తిని ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన వారిపై ఉదాశీనంగా వ్యవహరించాడన్న ఫిర్యాదులపై  ఆయనను ఎన్నికల విధుల నుంచి తొలగించారు. అనంతర పరిణామాలతోపాటు లాక్‌డౌన్‌ కారణంగా ఆ ఉత్తర్వులు అమలు కాలేదు. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో ఈ ఉత్తర్వులు కూడా అమల్లోకి వచ్చాయి. 

Updated Date - 2021-01-23T06:47:55+05:30 IST