దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణిస్తుండటం అభినందనీయం

ABN , First Publish Date - 2021-03-07T07:03:32+05:30 IST

సకలాంగులతో సమానంగా దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణిస్తుండటం అభినందనీయమని రాష్ట్ర మహిళా, శిశు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ కమిషనర్‌ ఏఆర్‌ అనురాధ పే ర్కొన్నారు.

దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణిస్తుండటం అభినందనీయం
పోటీలను ప్రారంభిస్తున్న రాష్ట్ర మహిళ, శిశు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ కమిషనర్‌ ఏఆర్‌ అనురాధ, జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు

రాష్ట్ర మహిళ, శిశు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ కమిషనర్‌ ఏఆర్‌ అనురాధ

రాష్ట్రస్థాయి పారా క్రీడా పోటీలకు శ్రీకారం

అనంతపురం క్లాక్‌టవర్‌, మార్చి 6: సకలాంగులతో సమానంగా దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణిస్తుండటం అభినందనీయమని రాష్ట్ర మహిళా, శిశు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ కమిషనర్‌ ఏఆర్‌ అనురాధ పే ర్కొన్నారు. శనివారం స్థానిక పీటీసీ మైదానంలో రాష్ట్రస్థాయి పారా క్రీడా చాంపియన్‌షి ప్‌-2021కి ఆమెతోపాటు కలెక్టర్‌ గంధం చంద్రుడు ముఖ్య అతిథిగా హాజరై, ప్రారంభించారు. అనంతరం ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్రం నలుమూలల నుంచి దివ్యాంగులు ఇంత పెద్దసంఖ్యలో హాజరు కావటం వారి క్రీడాస్ఫూర్తికి నిదర్శనమన్నారు. రాష్ట్రస్థాయిలో గెలుపొంది, త్వరలో చెన్నై, బెంగళూరు, పాట్నాలో నిర్వహించే జాతీయ పోటీలకు అర్హత సాధించాలనీ, అక్కడ కూడా విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. అంతకుముందు క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ పీడీ విజయలక్ష్మి, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఏడీ అబ్దుల్‌ రసూల్‌, ఏపీ పారా స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు కోటేశ్వరరావు, కార్యదర్శి రామస్వామి, జిల్లా అధ్యక్షకార్యదర్శులు నాగరాజు, శ్రీనివాసులు, పీటీసీ డీఎస్పీలు అమర్‌నాథ్‌నాయు డు, దాస్‌, శ్రీనివాసులు, దిశ డీఎస్పీ శ్రీనివాసులు, కోచ్‌లు సురేష్‌, వన్‌కుమార్‌, రవి శంకర్‌రెడ్డి, రాజశేఖర్‌, శ్రీనివాసగౌడ్‌, పారా రాష్ట్ర క్రీడాకారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-07T07:03:32+05:30 IST