మానవ అక్రమ రవాణాపై నిఘా పెట్టండి

ABN , First Publish Date - 2021-07-31T06:46:20+05:30 IST

మానవ అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టి, కట్టడికి చర్యలు తీసుకోవాలని సీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్‌, లా అండ్‌ ఆర్డర్‌ ఏడీజీ రవిశంకర్‌ పేర్కొన్నారు.

మానవ అక్రమ రవాణాపై నిఘా పెట్టండి
వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరైన ఎస్పీ ఫక్కీరప్ప

మానవ అక్రమ రవాణాపై నిఘా పెట్టండి

అనంతపురం క్రైం, జూలై 30: మానవ అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టి, కట్టడికి చర్యలు తీసుకోవాలని సీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్‌, లా అండ్‌ ఆర్డర్‌ ఏడీజీ రవిశంకర్‌ పేర్కొన్నారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని వారిద్దరూ రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు, ఉన్నతాధికారులతో డీజీపీ కార్యాలయం నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఇతర ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల సభ్యుల సహకారంతో మానవ అక్రమ రవాణాను అరికట్టాలన్నారు. నిత్యం నిఘా పెట్టాలని దిశానిర్దేశం చేశారు. ఎస్పీ ఫక్కీరప్ప తన చాంబర్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు.


Updated Date - 2021-07-31T06:46:20+05:30 IST