మహిళల భద్రతకు పెద్ద పీట

ABN , First Publish Date - 2021-03-08T06:50:27+05:30 IST

సమాజంలోని అ మ్మాయిలు, మహిళల రక్షణకు ప్రభుత్వం పెద్దపీట వే స్తోంది.

మహిళల భద్రతకు పెద్ద పీట
అనంతపురంలో చేపట్టిన కొవ్వొత్తుల ర్యాలీలో డీఐజీ కాంతిరాణాటాటా, ఎస్పీ సత్యఏసుబాబు

డీఐజీ కాంతిరాణాటాటా, ఎస్పీ సత్యఏసుబాబు 

అనంతపురం క్రైం, మార్చి 7 : సమాజంలోని అ మ్మాయిలు, మహిళల రక్షణకు ప్రభుత్వం పెద్దపీట వే స్తోంది. ఆ దిశగా జిల్లా పోలీసుశాఖ కూడా మహిళల భద్రతకు కృషి చేస్తోందని అనంతపురం రేంజ్‌ డీఐజీ కాంతిరాణాటాటా, జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల భద్రత కోసం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జిల్లా పోలీసుశాఖ సిబ్బందితో పాటు పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎ్‌సఎ్‌స విద్యార్థులు పెద్దఎత్తున తరలివచ్చారు. అతిథులు చేతులు మీదుగా ర్యాలీ ప్రారంభించి సప్తగిరి సర్కిల్‌ నుంచి టవర్‌క్లాక్‌ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ మహిళల భద్రత, రక్షణ కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు వెంకట్రావు, రామకృష్ణప్రసాద్‌, హనుమంతు, డీఎస్పీలు వీరరాఘవరెడ్డి, శ్రీనివాసులు, ప్రసాద్‌రెడ్డి, ఉమామహేశ్వ రరెడ్డి, మురళీధర్‌, పీటీసీ డీఎస్పీలు అమర్నాథ్‌నాయుడు, అల్లాబకాష్‌, దేవదాస్‌, పలువురు సీఐలు, ఎస్‌ఐలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


ఉత్తమ సేవలకు ప్రశంసలు

జిల్లా పోలీసుశాఖలో గత ఏడాదిలో తమ విధుల్లో ఉత్తమ సేవలందించిన మహిళా ఉద్యోగులు, మహిళా పోలీసులు, గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులు తదితర మ హిళా సిబ్బందికి అతిథులు మీదుగా శాలు వాతో సత్కరించి మొమెంటోలు అందజేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఉత్తమ సేవలందించిన ఎన్‌ఎ్‌సఎ్‌స మహిళా వలంటీర్లను సన్మానించారు. దిశా యాప్‌ మహిళలకు రక్షణకవచం లాంటిదని తెలియజేసే విధంగా రెండు వేర్వేరు ఘటనలకు సంబంధించి చిత్రీకరించిన లఘుచిత్రాన్ని ఈ సందర్భంగా ప్రదర్శించారు. 


స్వేచ్ఛగా ఓటెయ్యండి : ఎస్పీ 

అనంతపురం క్రైం, మార్చి7: జిల్లాలో ఈనెల 10వ తేదీన అనంతపురం నగరపాలక సంస్థతో పాటు జరి గేమున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌లో ఓటర్లు తమ ఓటు హ క్కును స్వేచ్ఛగా వి నియోగించుకోవాలని జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు సోమవారం ఓ ప్రకటన ద్వారా కోరారు. జిల్లా లో అనంతపురం నగరపాలక సంస్థతో పాటు ధర్మవరం, హిందూపురం, కదిరి, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు,  కళ్యాణదుర్గం, రాయదుర్గం, పుట్టపర్తి, మడకశిర మున్సిపాలిటీలలో జరిగే పోలింగ్‌కు పటిష్ట నిఘాతో పాటు భద్రతను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈనెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఆయా ప్రాంతాల్లోని లాడ్జీలు, ఫంక్షన్‌ హాళ్లలో ఇతర ప్రాంతాలకు చెందిన వారికి ఎలాంటి వస తి సదుపాయం కల్పించరాదని హెచ్చరించారు. వార్డు,  డివిజన్‌ల వారిగా ప్రత్యే క దృష్టిసారించడంతో పాటు పాత నేరస్థులు, రౌడీషీటర్లు, అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచామని తెలిపారు. గొ డవలు, అల్లర్లు వంటి వాటికి పాల్పడితే సహించమన్నారు. పో లింగ్‌ జరిగే ప్రాంతాల్లో ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే ఎంత టి వారినైనా ఉపేక్షించేదిలేదని ఆయన హెచ్చరించారు. సమస్య లు తలెత్తిన డయల్‌ -100 లేదా 9989 819191  నెంబర్‌కు ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారం అందించాలని తెలిపా రు. 


 దిశ యాప్‌తో మహిళలకు 10శాతం రాయితీ

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు శుభవార్తను ప్రకటించింది. పోలీసుశాఖ అమ లు చేస్తున్న దిశా యాప్‌ను మహిళలు తమ ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుంటే పలు రకాల వస్తువులు కొనుగోలు పై 10శాతం రాయితీ(డిస్కౌంట్‌) లభిస్తుందని జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు ఆదివారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. విద్యార్థినులు, మహిళలు జిల్లా వ్యాప్తంగా సూచించిన 197 సెల్‌ఫోన్‌, దుస్తుల దుకాణాలు, షాపింగ్‌ మాల్స్‌ తదతర వ్యాపార సముదాయాలలో ఏ ర్పాటు చేసిన బార్‌ కోడ్‌ ద్వారా స్కాన్‌ చేసి ప్రత్యేక రాయితీ(10శాతం) పొం దవచ్చునని తెలిపారు. ఈనెల8వ తేదీన  అదీ మ హిళలకు మాత్రమే ఈ రాయితీ సదుపాయం వర్తిస్తుందన్నారు. 

Updated Date - 2021-03-08T06:50:27+05:30 IST