కేలండరూ లేదు... క్లాసులూ లేవు..

ABN , First Publish Date - 2021-06-14T06:37:57+05:30 IST

జూన్‌ 12వ తేదీ వస్తే బడి గంటలు మోగేవి. కొత్త బ్యాగులు, పుస్తకాలు, కొ త్త క్లాస్‌ అంటూ హడావుడి ఉండేది.

కేలండరూ లేదు... క్లాసులూ లేవు..
విద్యాశాఖ డైరెక్టర్‌ ఇచ్చిన ఉత్తర్వు

అకడమిక్‌ కేలండర్‌ రూపొందించాలన్న విద్యాశాఖ డైరెక్టర్‌

డీడీ, రేడియో, ఇతర మాధ్యమాల్లో

ఆన్‌లైన్‌ క్లాసులు పెట్టాలంటూ ఆదేశాలు

జూన్‌ 12 నుంచి అమలు చేయాలని ఉత్తర్వులు

క్షేత్రస్థాయిలో కానరాని అమలు

మొద్దనిద్రలో ఎస్‌సీఈఆర్టీ  

అనంతపురం విద్య, జూన్‌ 13: జూన్‌ 12వ తేదీ వస్తే బడి గంటలు మోగేవి. కొత్త బ్యాగులు, పుస్తకాలు, కొ త్త క్లాస్‌ అంటూ హడావుడి ఉండేది. పిల్లలతోపాటు పె ద్దలకు పాఠశాలల ఆలోచన వచ్చేది. కరోనా వల్ల రెండేళ్లుగా పిల్లలు ఆ మాట మర్చిపోయారు. పెద్దలు పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో కరోనా పేరు చెప్పి వదిలేయకుండా పిల్లలకు పాఠాలు చెప్పించాలన్న ఉద్దేశంతో విద్యాశాఖ డైరెక్టర్‌ అకడమిక్‌ కేలండర్‌ రూపొందించాలనీ, ఆన్‌లైన్‌ క్లాసుల ద్వారా వారికి పాఠ్యాంశాల బోధన సాగేలా చూడాలని మే 30న ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ) ఆ దిశగా అడుగేయలేదు. ఇప్పటివరకూ కేలండర్‌ లేదు. ఎలాంటి ఆన్‌లైన్‌క్లాసులు లేవు. ఎస్‌సీఈఆర్టీ మొద్దు నిద్ర వీడటం లేదు.


ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏవీ..?

విద్యార్థులకు విద్యాబోధన అందించడానికి విద్యాశాఖ ఎలాంటి ప్రత్యామ్యాయ ఏర్పాట్లు చేయలేదన్నది స్పష్టమ వుతోంది. పేపర్ల వరకే పరిమితం అవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యా కేలండర్‌ను రూపొందించాలని ఎస్‌సీఈఆర్టీ  డైరెక్టర్‌ను గతనెల 30న విద్యాశాఖ డైరెక్టర్‌ చినవీరభద్రుడు ఆదేశించారు. స్కూళ్లు ప్రారంభం కాకపోయినా విద్యార్థులకు ఆన్‌లైన్‌ ద్వారా బోధన అందేలా చూడాలన్నారు. ఈ క్రమంలో పాఠ్యాంశాలను రూపొందించి దూరదర్శన్‌ (డీడీ), రేడి యో, యూట్యూబ్‌, ఇతర మాధ్యమాల్లో పిల్లలకు పా ఠాలు చెప్పేలా చూడాలన్నారు. కేలండర్‌ను రూపొందిస్తే టీవీలు, స్మార్ట్‌ఫోన్ల ద్వారా పిల్ల లు పాఠ్యాంశాలు వినే వెసలుబాటు ఉంటుందన్నది ఆ ఉత్తర్వుల సారాం శం. 12న క్లాసులు ప్రారంభం కావాలంటే ముందుగానే కేలండర్‌ రూపొందించాలి. ఆన్‌లైన్‌ పాఠ్యాం శాలు తయారు చేసి, జిల్లాలకు సమాచారం ఇవ్వాలి. ఇప్పటి వరకూ ఆ దిశగా అడుగు పడలేదని స్పష్టమవుతోంది. ఎస్‌సీఈఆర్టీ అకడమిక్‌ కేలండర్‌ తయారు చేయలేదు. ఆన్‌లైన్‌ క్లాసులపైనా అడుగు ముందుకేయకపోవడం పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏటా అకడమిక్‌ కేలండర్‌ ఏప్రిల్‌లో విడుదల చేస్తారు. పాఠశాలలు, విద్యార్థులు, టీచర్లకు సంబంధించి అన్ని అంశాలు అందులో ఉంటాయి. ఏయే సిలబస్‌ ఎప్పుడు పూర్తి చేయాలి, పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలి, పండుగలు, సెలవులు తదితర అంశాలతో కూడిన సమగ్ర వివరాలు అందులో ఉంటాయి. ఈ విషయంలో ఎస్‌ఈటీఆర్టీ తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందనడంలో సందేహం లేదు. అకడమిక్‌ అంశాల అమలులో విద్యాశాఖ, ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

Updated Date - 2021-06-14T06:37:57+05:30 IST