కిట్లు... అగచాట్లు

ABN , First Publish Date - 2021-04-22T06:21:43+05:30 IST

ప్రభుత్వం అందిం చిన జగనన్న విద్యాకానుక (జేవీకే) కిట్లలో భారీగా కిరికిరి జరిగిం ది. విద్యార్థుల సంఖ్యకు, సరఫరా చేసిన కిట్లకు పొంతన లే కుండా పోయింది.

కిట్లు... అగచాట్లు
బూట్లు ఇవ్వక పోవడంతో చెప్పులు వేసుకుంటున్న విద్యార్థులు

విద్యార్థులకు పూర్తిగా జేవీకే కిట్లు

12 వేల జతల బూట్లు మూలకు 

2 జతల యూనిఫాంతోనే సరి

అరకొరగా నోట్‌బుక్స్‌ సరఫరా  

చేతులెత్తేసిన కాంట్రాక్టర్‌

అనంతపురం విద్య, ఏప్రిల్‌ 21: ప్రభుత్వం అందిం చిన జగనన్న విద్యాకానుక (జేవీకే) కిట్లలో భారీగా కిరికిరి జరిగిం ది. విద్యార్థుల సంఖ్యకు, సరఫరా చేసిన కిట్లకు పొంతన లే కుండా పోయింది. పిల్లలకు అందించాల్సిన బూట్లు సుమా రు 12 వేల జతలు గోడౌన్‌లో మూలుగు తున్నాయి. నోట్‌బుక్కు లు 18.58 లక్షలు అందించినట్లు అధికారులు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో పిల్లలకు సరిప డా చేతికి అందలేదు. యూనిఫామ్స్‌ ఒక్కో విద్యార్థిని 3 జతలు ఇస్తామన్నారు. కానీ చాలా స్కూ ళ్లలో 2 జతలకు సరిపడా క్లాత్‌ ఇచ్చినట్లు ఆరోపణలు వి నిపిస్తున్నాయి. నాణ్యత లోపించిన బ్యాగులు ఇవ్వడంతో త్వర గా జిప్‌లు ఫెయిల్‌ అయ్యాయని, దీంతో 25 శాతం నుంచి 40 శాతం విద్యార్థులు వాటిని వాడటం లేదని సమాచారం.  జి ల్లాలో 4.04 లక్షల మంది విద్యార్థులుంటే 378178 మాత్రమే బ్యాగులు అందించారు.  


కొత్తగా చేరిన వారికి అందని ‘కానుక’

జిల్లాలో బూట్ల పంపిణీ పెద్ద ఫీట్‌గా మారిందంటూ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు. జిల్లా సమగ్రశిక్ష ప్రాజెక్టు అధికారుల లెక్కల మేరకు 2019-2020 విద్యా సంవత్సరానికి ఎన్‌రోల్‌మెంట్‌ మేర కు3,61,488 మంది విద్యార్థులు ఉండగా జగనన్న విద్యా కానుక కింద మొదట 3,61, 488 కిట్లు వచ్చినట్లు చెబుతు న్నారు. తర్వాత ప్రవేశాలు (2020-2021 అకడమిక్‌ ఇయర్‌) పెరిగే అవకాశం ఉందన్న అంచనాతో మరో 8 శాతం అంటే 31,774 కిట్లు అదనంగా జిల్లాకు వచ్చినట్లు అధికా రులు చెబుతున్నారు. మొత్తంగా జేవీకే కింద 3,93,262 కిట్లు వచ్చాయని చెబుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వరంగ స్కూళ్లలో ప్రవేశాలు భారీగా పెరిగాయి. కిట్లు పంపిణీ, అమ్మఒడి తదితర కారణాల వల్ల  జిల్లాలో విద్యార్థుల సంఖ్య 4.04 లక్షలు మందికి చేరింది. అయితే పెరిగిన సుమారు 11 వేల మంది విద్యార్థులకు కిట్లు సరఫరా చేయలేదని సమాచారం. కొత్తగా స్కూళ్లలో ఎంత మంది చేరారు...? ఎన్ని కిట్లు కావాలంటూ....అధికారులు ఇప్పటికే రెండు సార్లు స్కూళ్ల నుంచి వివరాలు తీసుకున్నారు కానీ నేటికీ సరఫరా చేసిన పాపాన పోలేదంటూ ప్రధానోపా ధ్యాయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.  


బ్యాగులు...తక్కువే...

జేవీకే  పంపిణీ కోసం జిల్లాకు 3,86,000 జతల బూ ట్లు సరఫరా చేశారు.  అయితే చాలా స్కూళ్లలో విద్యార్థు లకు బూ ట్లు సరిపోకపోవడంతో  చాలా వాటిని అన్‌సైజ్‌ గా గుర్తించారు. నవంబర్‌ ఆఖరి వారం, డిసెంబర్‌ మొద టి వారంలో జిల్లా వ్యాప్తంగా 24 మండలాల్లో అన్‌సైజ్‌గా తేలిన  సుమారు 23 వేల జతల బూట్లను 34 మండలాల కు సర్దుబాటు చేశారు. అయినప్పటికీ వాటిలో 7 వేల పై చిలుకు బూట్లు అన్‌సైజ్‌గా మిగిలిపోయాయి. వీటికితోడు జిల్లాకు జనవరి 24వ తేదీ కొత్తగా 4,904 జతల బూట్లు వచ్చాయి. అన్‌సైజ్‌గా మిగిలిపోయిన 7 వేలపై చిలుకు జతల బూట్లతోపాటు కొత్తగా వచ్చిన 4904 వేల బూట్లు కలిసి ఏకంగా12 వేల జతల బూట్లు రాప్తాడు సమీపం లోని మోడల్‌ స్కూల్‌ గోదాంలో భద్రపర్చారు. మూడు న్నర నెలలుగా గోదాంలోనే మూలుగుతున్నాయి. వాటిని ఏం చేయాలన్న దానిపై రాష్ట్ర అధికారుల  ఆదేశాల కోసం  జిల్లా సమగ్రశిక్ష అధికారులు ఎదురుచూస్తున్నారు. జిల్లా కు 18,58,244 నోట్‌బుక్స్‌ వచ్చాయని అధికారులు చెబు తున్నారు. ఏడో తరగతి విద్యార్థులకు 8 నోట్‌ బుక్స్‌, 8వ తరగతికి 10, 9వ తరగతికి 12, 10వ తరగతికి 14 నోట్‌బుక్స్‌ ఇవ్వాల్సిఉంది. సప్లయర్‌ జిల్లాకు సరిపడా సప్లై చేయకపోవడంతోనే వేలాది మంది విద్యార్థులకు సరిగా బుక్స్‌ చేరలేదంటూ టీచర్లు గగ్గోలు పెడుతున్నారు.  బ్యా గులు 3,78,187, యూనిఫామ్‌ క్లాతు 4,05222, బెల్టులు 2,96,644 సప్లై చేసినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో విద్యార్థులు 4.04 లక్షలు ఉంటే బ్యాగులు 3.78 లక్షలే సరఫరా చేశారు. దీంతో నేటికీ దాదాపు పాతిక వేల మందికి వాటి కోసం ఎదురు చూస్తున్నారు. 

- అనంతపురం నగరంలోని రాజేంద్ర మున్సిపల్‌ హైస్కూల్‌లో 932 మంది విద్యార్థులున్నారు. వచ్చిన బూ ట్లలో 9,10 తరగతుల విద్యార్థులకు సైజ్‌ సరిపోకపో వడంతో సుమారు 80 జతలు వెనక్కు పంపారు. నేటికీ ఆ 80జతల బూట్లు తిరిగి స్కూల్‌కు చేరలేదు.  

- శింగనమల మండల వ్యాప్తంగా 4300 మంది విద్యా ర్థులు ఉండగా, 3776 మందికి మాత్రమే సరఫరా చేశారు. అయితే నేటికీ 524 మంది విద్యార్థులకు బూట్లు అందలేదు.

- రాప్తాడు మోడల్‌ స్కూల్‌లో  391 మంది విద్యా ర్థులు ఉన్నారు. అయితే బూట్ల సైజు 8,10 రాకపోవడంతో 9,10 తరగతుల చదివే వి ద్యార్థులు 60 నుంచి 70 మందికి నేటికీ బూట్లు అందించలేదు. ఇలా జిల్లా కిట్ల పంపిణీ గందరగోళంగా తయారైం దనడంలో సందేహం లేదు. రాష్ట్ర స్థాయిలో కిట్ల పంపిణీలో కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు ఆరోపణ లు బలంగా వినిపిస్తున్నాయి. గత ఎస్పీడీ ప్రవేయంపై ప్రస్తుత ఎస్పీడీ రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో.... కిట్ల పంపిణీ, గోల్‌మాల్‌ పెద్ద దుమారం రేగింది. విద్యా ర్థులకు సరిపడా బూట్లు కానీ, నోటు పుస్తకాలు కానీ సప్లై కాలేదు. అధికారులు అదనంగా తెప్పించామని గొప్పలు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం విద్యార్థులకు చేర లేదు. భారీగా గోల్‌మాల్‌ జరిగిందనడంలో సందేహం లేదు. అయితే అధికార పార్టీ పెద్దల అనుయాయులే సప్ల యర్లుగా ఉండటం వల్ల పూర్తి స్థాయిలో కిట్లు సరఫరా కాకున్నా అధికారులు నోరు మెదపలేకపోతున్నారన్న వి మర్శలు వినిపిస్తున్నాయి.






బూట్లు రాలేదు

నేను 10వ తరగతి చదువుతున్నా. జగన్నవిద్యా కానుకలో భాగంగా మాకు కూడా బూట్లు ఇస్తామన్నారు. అయితే నా పాదాల సైజ్‌ 10. ఆ సైజ్‌ రాకపోవడంతో ఇవ్వలేదు. దీంతో చెప్పులతోనే స్కూల్‌కు వస్తున్నా. 

- ప్రవీణ్‌నాయక్‌, 10వ తరగతి విద్యార్థి


కొంత మందికి ఇచ్చారు...మాకు ఇంకా రాలేదు 

రాప్తాడు మోడల్‌ స్కూల్‌లో 9వతరగతి చదువుతున్నా. మా స్కూల్లో కొంత మందికి ఇచ్చారు. కొందరికి బూట్ల సైజ్‌ సరిపోకపోవడంతో మళ్లీ ఇస్తామన్నారు. నా పాదాల సైజ్‌ 8వ నెంబర్‌. అవి రాకపోవడంతో ఇవ్వలేదు. వచ్చాక ఇస్తామన్నారు. 

-  ధాత్రిప్రియ, 9వ తరగతి విద్యార్థిని



మిగిలిన బూట్లు భద్రపరిచాం

జిల్లాకు మొదట వచ్చిన బూట్లలో అన్‌సైజ్‌గా 7 వేల బుట్ల జతలు మిగిలాయి.  కొత్తగా మరో 5 వేల వరకూ రావడంతో....రాప్తాడు మోడల్‌ స్కూల్‌ గోడౌన్‌లో భద్రపరిచాం. అయితే వాటిని ఏం చేయాలన్న దానిపై నిర్ణయం కోసం ఉన్నతాధికారుల ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాం.  

- ఓబుళపతి, సీఎంఓ, సమగ్రశిక్ష

Updated Date - 2021-04-22T06:21:43+05:30 IST