Abn logo
Sep 22 2021 @ 00:35AM

మూడు రోజులుగా సతాయింపు

అనంతపురం నగరంలోని కొవ్వూరు నగర్‌ ఎఫ్‌పీ షాపులో సర్వర్‌ సమస్యతో నిరీక్షిస్తున్న కార్డుదారులు

ఉచిత బియ్యం పంపిణీకి సర్వర్‌ దెబ్బ 

మూడు రోజులుగా సతాయింపు  

ఎఫ్‌పీ షాపుల వద్దే గంటల తరబడి నిరీక్షణ 

సమస్యను పరిష్కరించని యంత్రాంగం 

కార్డుదారులు, డీలర్లకు తప్పని ఇబ్బందులు 

అనంతపురం వ్యవసాయం, సెప్టెంబరు 21: కొవిడ్‌ నేపథ్యంలో ప్రభుత్వం అందించే ఉచిత బియ్యం పంపిణీకి సర్వర్‌ దెబ్బపడింది. ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేఏవై) ద్వారా బియ్యం కార్డులోని ఒక్కో సభ్యుడికి ఐదు కేజీల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేయాలని ప్రభు త్వం నిర్ణయించింది. మూడు రోజుల క్రితం ఎఫ్‌పీ షాపుల్లో బియ్యం పంపిణీ ప్రారంభించారు. తొలిరోజు నుంచే సర్వర్‌ సమస్యతో పంపిణీ ముందుకు సాగడం లేదు. రోజూ తెల్లవారుజామున, ఉదయమే షాపు లు తెరిచినా.. పంపిణీ చేయలేని దుస్థితి నెలకొంది. ఉదయం 8 గంటలకు తెరిచిన షాపుల్లో ఉచిత బియ్యం పంపిణీకి బ్రేక్‌ పడుతోంది. కార్డుదారుల వివరాలు న మోదు చేసేందుకు అవకాశం లేకుండా సర్వర్‌ మొరాయిస్తోంది. ఒక్కోసారి కార్డుదారుల వివరాలు నమోదు చేసేంత వరకు పనిచేసి, ఆ తర్వాత సర్వర్‌ డౌన అవుతోంది. ఇలా పలు రకాలుగా సర్వర్‌ ఎరర్‌ చూ పిస్తుండటంతో ఏం చేయాలో తోచని అయోమయంలో డీలర్లు కొట్టుమిట్టాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆశించిన స్థాయిలో బి య్యం పంపిణీ చేయలేకపోతున్నారు.


ఎఫ్‌పీ షాపుల వద్దే గంటల తరబడి పడిగాపులు

జిల్లావ్యాప్తంగా 3వేల ఎఫ్‌పీ షాపులున్నాయి. వీటి పరిధిలో 12.27 లక్షల బియ్యం కార్డులున్నాయి. జిల్లాకు 18వేల మెట్రిక్‌ ట న్నుల ఉచిత బియ్యాన్ని కేటాయించారు. సర్వర్‌ సమస్యతో ఎఫ్‌ పీ షాపుల వద్ద గంటల తరబడి కార్డుదారులు నిరీక్షించాల్సి వస్తోంది. మహిళలు, వృద్ధుల అవస్థలు వర్ణనాతీతం. ఎంత సేపటికీ సర్వర్‌ పనిచేయకపోవడంతో అనేక మంది కార్డుదారులు చేసేదేమీ లేక ఇంటి ముఖం పడుతున్నారు. సర్వర్‌ బాగా పనిచేసినపుడు తామే సమాచారం ఇస్తామని కొందరు డీలర్లు.. కార్డుదారులకు సర్దిచెబుతూ కాలం వెల్లదీస్తున్నారు. సర్వర్‌ స మస్యను పౌరసరఫరాల అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎ లాంటి ప్రయోజనం ఉండటం లేదని డీలర్లు వాపోతున్నారు. ఎనఐసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లామనీ, వారి నుంచి సమాధానం వచ్చిన తర్వాత చెబుతామని స్థానిక అధికారులు చేతులెత్తేస్తుండటం గమనార్హం. ఇప్పటికైనా పౌరసరఫరాల ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని, సర్వర్‌ సమస్య నుంచి కార్డుదారులకు విముక్తి కల్పించాల్సి ఉంది.


సర్వర్‌ సమస్య ఎక్కువగా ఉంది 

- బాలనాగిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు, ఎఫ్‌పీ షాపు డీలర్ల సంఘం  

జిల్లాలో మూడు రోజుల నుంచి ఉచిత బియ్యం పంపిణీ చే స్తు న్నాం. అప్పటి నుంచి సర్వర్‌ సమస్య ఎక్కువైంది. తెల్లవారుజామున, మధ్యాహ్నం సమయంలో గంటపాటు మాత్రమే స ర్వర్‌ పనిచేస్తోంది. మిగిలిన సమయాల్లో పూర్తిగా పనిచేయడం లే దు. కార్డుదారులతోపాటు డీలర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని సర్వర్‌ సమస్య లే కుం డా చర్యలు తీసుకోవాలి.

సర్వర్‌ కోసం ఈ-పోస్‌ యంత్రాన్ని చెక్‌ చేస్తున్న డీలర్‌