Abn logo
Jan 27 2021 @ 01:30AM

కలెక్టర్‌ గంధం చంద్రుడు పిలుపు..

జాతీయ జెండాకు గౌరవ వందనం చేస్తున్న కలెక్టర్‌ గంధం చంద్రుడు, ఎస్పీ సత్యయేసుబాబు, జేసీ నిషాంత్‌ తదితరులు

 జిల్లా సర్వతోముఖాభివృద్ధికి సమష్టిగా కృషి 

కలెక్టర్‌ గంధం చంద్రుడు పిలుపు..

పోలీస్‌ పరేడ్‌ మైదానంలో ఘనంగా గణతంత్ర వేడుకలు

అనంతపురం, జనవరి26(ఆంధ్రజ్యోతి): జిల్లా సర్వతోముఖాభివృద్ధికి సమష్టిగా కృషి చేద్దామని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు పేర్కొన్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలను పేదల దరి చేర్చేందుకు ప్రతిఒక్క రూ జిల్లా యంత్రాంగానికి సహకరించాలని అన్నివర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్థానిక పోలీసు పరేడ్‌ మైదానంలో మంగళవారం 72వ గణతంత్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు కలెక్టర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించి, గౌరవ వందనం చేశారు. అనంతరం సాయుధ పోలీసు దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. గణతంత్ర దినోత్సవ సం దేశాన్ని చదివి, వినిపించారు. గణతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నడూ ఎరుగని కల్లోలాన్ని కరోనా రూపంలో దేశం చవిచూసిందన్నారు. ప్రజలంతా ఆ ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. ఏడాది కాలం మొక్కవోని దీక్షతో కరోనా మహమ్మారిని ఎదిరించి నిలబడటంతోపాటు.. ఈ పోరాటంలో గణతంత్ర వ్య వస్థ పటిష్టత మరోసారి రుజువైందని తెలియజేస్తున్నందుకు గ ర్వపడుతున్నానన్నారు.


జిల్లా ప్రగతిని వివరిస్తూ..

జిల్లాలో గతేడాది జరిగిన ప్రగతిని కలెక్టర్‌ తన ప్రసం గంలో వివరించారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.112 కోట్లు ఖర్చు చేసి, 53,310 మందికి వైద్యసేవలు అందించాం. ఇప్పటి వరకూ క్యూఆర్‌ కోడ్‌ ముద్రించిన 11,69,626 హెల్త్‌ కార్డులను పంపిణీ చేశాం. ప్రతి మండలానికీ 108 అంబులెన్స్‌లను ప్రభుత్వం మంజూరు చేసిం ది. 104 వాహనాలను 63 మండలాలకు సమకూర్చాం. జిల్లాలో 15 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు నూతన భవనాలు నిర్మించాం. మరో 73 భవనాల నిర్మాణానికి రూ.69.42 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. కంటి వెలుగు ద్వారా జిల్లాలో 5,39,231 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించాం. పేదల సొం తింటి కలను నెరవేర్చాలనే దృఢ సంకల్పంతో జి ల్లాలో 2,20,549 మందికి ప్రభుత్వం ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తోంది. కుల, మతాలకు తావు లేకుండా అందరూ కలిసి ఉండేలా ఇళ్ల స్థలాలను కే టాయించి, అన్ని వసతులతో కాలనీలు ఏర్పాటు చేశాం. రాజ్యాం గ సూచనలను అనుసరించి ఎస్సీ, ఎస్టీ కాలనీలను అవే పేర్లతో పిలవడం సరికాదన్న ఉద్దేశంతో వాటి పేర్లు మార్చాం. అమ్మఒడి ద్వారా గత విద్యా సంవత్సరంలో 3,62,579 మంది తల్లులకు రూ.543.86 కోట్లు, ఈ ఏడాదిలో 3.81,559 మందికి రూ.572.33 కోట్లు అందించాం. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ.215.14 కోట్లు ఖర్చు చేసి, కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతున్నాం. సమగ్రశిక్ష ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు రూ.79.66 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ‘మన అనంత-సుందర అనంత’ నినాదంతో అనంతపురాన్ని పరిశుభ్రమైన నగరంగా మార్చాం. రైతు భరోసా ద్వారా ఏటా రూ.13500 చొప్పున 5.76,972 కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తోంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన సౌకర్యాలను సమకూరుస్తున్నాం. జిల్లాలో గతంలో ఆత్మహత్య చేసుకున్న 34 మంది రై తు కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున రూ.2.38 కోట్లు అందజేశాం. కిసాన్‌ రైలు ద్వారా రైతులు పండించిన ఉద్యాన పంటలను ఢిల్లీ మార్కెట్లో విక్రయించేందుకు అందరి సహకారంతో ముందుకు సాగాం. వందశాతం డ్రిప్‌ వాడుతున్న జిల్లాగా మా ర్చే లక్ష్యంతో కృషి చేస్తున్నాం. బీమా, పింఛన్‌ కానుక, చేయూత, ఆసరా, వాహనమిత్ర తదితర పథకాల ద్వారా ఆయావర్గాల ప్ర జలకు ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోంది. ఇలా రాష్ట్ర ప్ర భుత్వం ఆధ్వర్యంలో జిల్లాలో సాధించిన ప్రగతిని, చేస్తున్న అభివృద్ధి పనులను వివరించారు. జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని రకాలుగా కృషి చేస్తామని కలెక్టర్‌ తన ప్రసంగంలో తెలియజేశారు. కార్యక్రమంలో ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, ఎస్పీ సత్యయేసుబాబు, జేసీలు నిశాంత్‌కుమార్‌, డాక్టర్‌ సిరి, గంగాధర్‌గౌడ్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సూర్య, డీఆర్వో గాయత్రీదేవి, ఆర్డీఓ గుణభూషణ్‌రెడ్డి, మాజీ మేయర్‌ రాగే పరశురాం, ఆర్డీటీ విశాలాఫెర్రర్‌, ఎకాలజీ డైరెక్టర్‌ మల్లారె డ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు, రెవెన్యూ, పోలీసు సిబ్బంది, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రసంగిస్తున్న కలెక్టర్‌ గంధం చంద్రుడు

ఆకట్టుకున్న శకటాలు

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

అనంతపురం టౌన్‌: స్థానిక పోలీస్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో వివిధ శాఖల శకటాల ప్రదర్శన, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తొలుత ప్లటూన్ల వారీగా పోలీసులు, ఎన్‌సీసీ విద్యార్థులు కవాతు చేస్తూ జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు, ఎస్పీ సత్యయేసుబాబుకు గౌరవవందనం సమర్పించారు. అనంతరం వజ్ర, మైన్‌ ప్రూఫ్‌ వాహనాలు ప్రదర్శనగా ముందుకు సాగాయి. ఆ వెంటనే వ్యవసాయ, గృహనిర్మాణ, డ్వామా, డీఆర్‌డీఏ, వైద్యఆరోగ్య, విద్య, అగ్నిమాపక, పౌరసరఫరాలు, ఐసీడీఎస్‌, ఏపీ ఐఐసీ, నగరపాలక సంస్థ శకటాలు సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రదర్శనగా సాగాయి. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనల్లో గార్లదిన్నె, పామిడి, పుట్టపర్తి, కూడేరు, కురుగుంట, బుక్కరాయసముద్రం మండలాల కేజీబీవీల విద్యార్థినులు దేశభక్తి గీతాలకు చేసిన నృత్యాలు అలరించాయి. ప్రదర్శనల అనంతరం ఆయా ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ ఉద్యోగులు, ఉత్తమ స్వచ్ఛంద సేవకులకు జిల్లా కలెక్టర్‌ ప్రశంసాపత్రాలు అందజేశారు. కవాతు నిర్వహణలో ఎన్‌సీసీ బాలురు, బాలికల బెటాలియన్లకు బహుమతులు, ప్ర శంసాపత్రం, జ్ఞాపికలు ప్రదానం చేశారు. శకటాల ప్రదర్శనలో డీఆర్‌డీఏ ప్రథమ, డ్వామా ద్వితీయ, వైద్య ఆరోగ్యశాఖ శకటం తృతీయస్థానంలో నిలిచాయి. ఆయా శాఖల సిబ్బందికి బహుమతులు అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న కేజీబీవీ విద్యార్థినులకు ప్రోత్సాహక బహుమతులు, ప్రశంసాపత్రాలు ప్రదానం చేశారు. అనంతరం ఆయా ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను కలెక్టర్‌, ఎస్పీ సందర్శించారు.


భరతమాత వేషధారణ.. అలరిస్తున్న నృత్యం

సొమ్మసిల్లి పడిపోయిన ఎన్‌సీసీ క్యాడెట్లు

గణతంత్ర దినోత్సవాల్లో పోలీసులతోపాటుగా ఎన్‌సీసీ క్యాడెట్లు పరేడ్‌ నిర్వహించటం ఆనవాయితీ. వారంరోజుల ముందు నుంచే వారితో రిహార్సల్స్‌ చేయిస్తుంటారు. పరేడ్‌ నిర్వహణకు వచ్చిన వారి యోగక్షేమాలు చూసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించటం కారణంగా మంగళవారం పరేడ్‌ మైదానంలో పలువురు ఎన్‌సీసీ క్యాడెట్లు నీరసంతో సొమ్మసిల్లి పడిపోవటం కనిపించింది. బాలయేసు గురుకుల పాఠశాల, ఎస్‌ఎ్‌సబీఎన్‌ పాఠశాలల నుంచి ఎన్‌సీసీ క్యాడెట్లను అధికారులు మంగళవారం ఉదయం 6 గంటలకే పరేడ్‌ మైదానానికి చేర్చి, రిహార్సల్స్‌ చేయించారు. జిల్లా కలెక్టర్‌ ఉదయం 9 గంటలకు పతాకావిష్కరణ గావించగానే పోలీసు బెటాలియన్లతోపాటు వారు కలెక్టర్‌కు గౌరవ వందనం సమర్పించారు. కలెక్టర్‌ సం దేశం ముగిసేవరకూ పోలీసులతోపాటు మైదానంలో నిల్చుని ఉండాల్సి ఉంది. ఉదయాన్నే మైదానానికి చేరుకున్న ఎన్‌సీసీ క్యాడెట్లకు అల్పాహారం, కనీసం మంచినీరు కూడా ఇవ్వలేదు. దీనికితోడు ఎండ తీవ్రత వల్ల కలెక్టర్‌ సందేశమిస్తుండగా.. అప్పటికే నీరసించిపోయిన ఎన్‌సీసీ క్యాడెట్లు ఒకరొకరుగా ఆరుగురు సొమ్మసిల్లి కింద పడిపోయారు. దీంతో కలెక్టర్‌ తన సందేశాన్ని మధ్యలో ఆపి, ఎన్‌సీసీ క్యాడెట్లను షేమియానాల కిందకు పం పాలని ఆదేశించారు. క్యాడెట్లు షేమియానాల కిందకు వెళ్లిన అ నంతరం కలెక్టర్‌ సందేశాన్ని కొనసాగించారు.


ఢిల్లీలో ఊరేగిన లేపాక్షి బసవన్న 

టీవీలో కార్యక్రమాన్ని చూస్తూ 

సంబరపడిన జిల్లా వాసులు

లేపాక్షి, జనవరి 26: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఢిల్లీ పరేడ్‌లో నిర్వహించిన శకటాల ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్‌ తరపున  లేపాక్షి బసవన్న శకటాన్ని ప్రదర్శించారు. లేపాక్షి నంది విగ్రహం, కల్యాణమండపం, ఏడుశిరస్సుల నాగేంద్రుడు, చుట్టూ కళాకారులతో శటకాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లావాసులు టీవీలో చూస్తూ సంబర పడిపోయారు. లేపాక్షి ఖ్యాతి దేశ నలుమూలలా వ్యాపించిందని ఆనందించారు.

Advertisement
Advertisement
Advertisement