రాయదుర్గం నడిబొడ్డున బ్లాస్టింగ్‌

ABN , First Publish Date - 2021-04-17T06:05:35+05:30 IST

ప్రశాంత పట్టణం శుక్ర వారం ఉదయం ఉలిక్కిపడింది.

రాయదుర్గం నడిబొడ్డున బ్లాస్టింగ్‌
బ్లాస్టింగ్‌లో ముక్కలైన రాళ్లు

 ఉలిక్కిపడ్డ పట్టణ ప్రజలు 

రాయదుర్గం, ఏప్రిల్‌ 16: ప్రశాంత పట్టణం శుక్ర వారం ఉదయం ఉలిక్కిపడింది. పట్టణ నడిబొడ్డున బ్లాస్టింగ్‌ చేయడంతో ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. భారీ శబ్దంతో పేలుళ్లు సంభవించడంతో రాజీవ్‌ గాంధీ కాలనీ చుట్టుపక్కల ఉన్న ఎస్సీ కాలనీతోపాటు రాయదుర్గం-అనంతపురం ప్ర ధాన రహదారి పరిసర ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు. రాజీవ్‌ గాంధీ కాలనీలో ఉన్న రాళ్ల గుట్టలో 60 సెంట్ల స్థలాన్ని చదును చేసేందుకు అందు లో ఉన్న కొండను తూటాలతో పాటు జెలిటిన్‌ స్టిక్స్‌ పెట్టి పేల్చారు. దీంతో భారీ శబ్దం సంభవించడం తో ప్రజలు ఉలిక్కిపడ్డారు. భూకంపం సంభవించిందని ఇ ళ్లలో ఉండే జనం బయటకు వచ్చి కేకలు పెట్టారు. పే లుడు సంభవించిన ప్రాంతానికి సమీపంలో ఉన్న రాజు కు చెందిన ఇంటి గోడలు చీలిపోయాయి. ఎస్సీ కాలనీలోని ఇళ్లు కంపించాయి. సాధారణంగా పోలీసు, రెవె న్యూ యంత్రాంగం అనుమతులు తీసుకుని అనంతరం ప్రజలను అప్రమత్తం చేసి బ్లాస్టింగ్‌లు చేసుకోవాల్సి ఉం టుంది. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఉదయా న్నే బ్లాస్టింగ్‌ చేయడంపై ప్రజలు తీవ్ర భయానికి లోనై పేలుడు సంభవించిన ప్రాంతానికి వెళ్లి గొడవ చేశారు. పేలుడు చేసే ముందు అనుమతులు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. గంటపాటు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెవెన్యూ అధికారులకు ఫరూక్‌, రాజు, రమే్‌షలతో పాటు మరికొందరు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అధికారులు సందర్శించలేదు. దీంతో చు ట్టుపక్కల ప్రజలు తీవ్రస్థాయిలో అధికారుల తీరుపై మండిపడుతున్నారు.



Updated Date - 2021-04-17T06:05:35+05:30 IST