రాబోయే ఐదు రోజులు చిరు జల్లులు

ABN , First Publish Date - 2020-12-02T06:43:49+05:30 IST

జిల్లాలో రాబోయే ఐదు రోజులు చిరు జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశమున్నట్లు ఆచార్య ఎన్జీ రంగా వాతావరణ శాస్త్రవేత్త అశోక్‌కుమార్‌ మంగళవారం ప్రకటనలో తెలిపారు.

రాబోయే ఐదు రోజులు చిరు జల్లులు

బుక్కరాయసముద్రం, డిసెంబరు1: జిల్లాలో రాబోయే ఐదు రోజులు చిరు జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశమున్నట్లు ఆచార్య ఎన్జీ రంగా వాతావరణ శాస్త్రవేత్త అశోక్‌కుమార్‌ మంగళవారం ప్రకటనలో తెలిపారు. వర్షాలు కురిసే రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 28.6 నుంచి 29.9 డిగ్రీల సెల్సియ్‌సగా.. కనిష్ట ఉష్ణోగ్రతలు 16.3 నుంచి 19.0 డిగ్రీల సెల్సియ్‌సగా నమోదయ్యే అవకాశాలున్నాయన్నారు. గాలులు గంటకు 20.9 నుంచి 24.2 కి.మీ., వేగంతో వీస్తాయన్నారు. గాలిలో తేమశాతం ఉదయం పూట 91.96, మధ్యాహ్నం 54 నుంచి 71 శాతం నమోదయ్యే అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2020-12-02T06:43:49+05:30 IST