అనంతపురం: పుట్టపర్తిలో వైద్యసేవలపై కరోనా ఎఫెక్ట్ పడింది. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో మరో 10 మంది సిబ్బందికి కూడా కరోనా వచ్చింది. ఎమర్జెన్సీ మినహా ఇతర వైద్యసేవలను బంద్ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన రోగులతో కరోనా కేసులు పెరిగాయి. స్థానికులకు మాత్రమే వైద్యం అందించాలని నిర్ణయించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రోగులకు వైద్య సేవలు నిలిపివేస్తూ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.
మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 4,570 కరోనా కేసులు నమోదు కాగా ఒకరు మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 21,06,280 కరోనా కేసులు నమోదు కాగా 14,510 మరణించారు. ప్రస్తుతం 26,770 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 20 లక్షల 65 వేల మంది రికవరీ అయ్యారు.
ఇవి కూడా చదవండి