పంటంతా తడిసి నష్టపోయాం..!

ABN , First Publish Date - 2020-10-31T09:56:00+05:30 IST

‘అధిక వర్షాలకు వేరుశనగ పంటంతా తడిసిపోయి నష్టపోయాం. మద్దతు ధరతో పంటను కొనుగోలు చేసి ఆదుకోవాలి’ అని మార్కెటింగ్‌ అండ్‌ కో-ఆపరేటివ్‌ స్పెషల్‌ సెక్రటరీ మధు సూదన్‌రెడ్డిని రైతులు వేడుకున్నా రు.

పంటంతా తడిసి నష్టపోయాం..!

మద్దతు ధరతో కొనుగోలు చేసి ఆదుకోండి 

మార్కెటింగ్‌ స్పెషల్‌ సెక్రటరీ మధుసూదన్‌రెడ్డికి 

వేరుశనగ రైతుల వేడుకోలు 


అనంతపురం వ్యవసాయం, అక్టోబరు 30: ‘అధిక వర్షాలకు వేరుశనగ పంటంతా తడిసిపోయి నష్టపోయాం. మద్దతు ధరతో పంటను కొనుగోలు చేసి ఆదుకోవాలి’ అని మార్కెటింగ్‌ అండ్‌ కో-ఆపరేటివ్‌ స్పెషల్‌ సెక్రటరీ మధు సూదన్‌రెడ్డిని రైతులు వేడుకున్నా రు. శుక్రవారం జిల్లాకు వచ్చిన ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించారు. అనం తపురం రూరల్‌ మండలం కురుకుంట, ఆత్మకూరులో వానకు తడిసిపోయిన వేరుశనగ పంటను పరిశీలించారు. ఈ ఏడాది జూన్‌ నుంచి అధిక వర్షాలకు పంట పూ ర్తిగా దెబ్బతిన్నట్లు రైతులు ఆయన దృష్టికి తీసుకువ చ్చారు. పొలాల్లోనే పంట తడిసిపోవడంతో నాణ్యత తగ్గిం దన్నారు. మద్దతు ధరతో తడిసిపోయిన పంటను కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరారు. ఇందుకు ఆయన స్పం దిస్తూ క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిగణలోకి తీసుకొని తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


అనంతరం కలెక్టరేట్‌లోని మినీ కార్ఫరెన్స్‌ హాల్‌లో జేసీ నిశాంత్‌ కుమార్‌తో కలిసి వ్యవసాయ అధికారులు, మార్కెఫెడ్‌, ఆయిల్‌ఫెడ్‌, సివిల్‌సప్లై, మా ర్కెటింగ్‌ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో మొక్కజొన్న, రాగి, కొర్ర,సజ్జ పంట ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. రైతు భరోసాకేంద్రాల్లో రైతు పేర్ల నమోదును మరింత వేగవంతం చేయాలన్నారు. అలాగే వేరుశనగ పంటను కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ సలహా బోర్డు సభ్యుడు మల్లారెడ్డి, జేడీఏ రామకృష్ణ, ఏడీఏ పీపీ విద్యావతి,  మార్కెఫెడ్‌ డీఎం సుబ్రహ్మణ్యం, ఆయిల్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ నారాయణస్వామి, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-31T09:56:00+05:30 IST