రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట : ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2020-10-30T09:08:33+05:30 IST

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్‌ అన్నారు.

రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట : ఎమ్మెల్యే

కళ్యాణదుర్గం మార్కెట్‌యార్డు కమిటీ పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం 


కళ్యాణదుర్గం, అక్టోబరు 29: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్‌ అన్నారు. గురువారం స్థానిక టీసర్కిల్‌లో కళ్యాణదుర్గం మార్కెట్‌యార్డు కమిటీ పాలకవర్గ సభ్యులు ప్రమాణాస్వీకారం చేశారు. ముందుగా వైఎ్‌సఆర్‌ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆశాఖ కార్యదర్శి రాంప్రసాద్‌ చైర్‌పర్సన్‌గా బిక్కినాగలక్ష్మీహరి, వైస్‌ చైర్మన్‌గా రామచంద్రతో పాటు పది మంది సభ్యులతో ప్రమాణాస్వీకారం చేయించారు. ఈసందర్భంగా ఏ ర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రం ఆర్థిక లో టులో ఉన్నా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రజాసంక్షేమం కోసం ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, మద్యపాన నిషేధం, వైఎ్‌సఆర్‌ పోషణ, వరదబాధితులను ఆదుకోవడం, ఆర్‌బీకే ద్వారా రైతులకు విశేష సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల హామీలను నెరవేరుస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారన్నారు. జగన్‌ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని టీడీపీ అధినేత చంద్రబాబు అనేక అడ్డంకులు సృష్టిస్తూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యను కూడా రాజకీయం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి బీటీపీకి నీరు తెచ్చేందుకు అహర్నిశలు కృషిచేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 90 శాతం భూసేకరణ పూర్తి చేశామని, త్వరలో కాలువల్లో నీరు పా రిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి తాగునీటి కొళాయి ఏర్పాటు చేస్తామన్నా రు. రోడ్డు విస్తరణ నిర్వాసితులకు పరిహారం అందిస్తామన్నారు. 

కార్యక్రమంలో శెట్టూరు జడ్పీటీసీ వైసీపీ అభ్యర్థి మంజునాథ్‌,  నాయకులు జయంఫణి, బాబురెడ్డి, నారాయణపురం వెంకటేశులు, నాగిరెడ్డిపల్లి రామాంజినేయులు, వ న్నూర్‌రెడ్డి, బోరంపల్లి కృష్ణారెడ్డి, బలరామ్‌, ప్ర సాద్‌రెడ్డి, సోమనాథ్‌రెడ్డి, బసవరాజు, గుద్దెళ్ల నాగరాజు, సుధాకర్‌, నరేంద్రరెడ్డి, అంజన్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-30T09:08:33+05:30 IST