మ్యాపింగ్‌ను రద్దు చేయిస్తాం: జేసీ

ABN , First Publish Date - 2020-10-01T09:42:38+05:30 IST

గతంలో పంపిణీ చేసిన పట్టాలకు చెక్‌ బంది, వివరాలు సరిగా లేకపోవడం వల్ల భవిష్యత్తు లో ఇబ్బందులు వస్తాయని, పట్టాలు పొందిన వారికి నవశకం వర్తించదని జాయింట్‌ కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ పేర్కొన్నారు.

మ్యాపింగ్‌ను రద్దు చేయిస్తాం: జేసీ

ఉరవకొండ,సెప్టెంబరు30: గతంలో పంపిణీ చేసిన పట్టాలకు చెక్‌ బంది, వివరాలు సరిగా లేకపోవడం వల్ల భవిష్యత్తు లో ఇబ్బందులు వస్తాయని, పట్టాలు పొందిన వారికి నవశకం వర్తించదని  జాయింట్‌ కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ పేర్కొన్నారు.  దీనిని దృష్టిలో పెట్టుకుని మ్యాపింగ్‌ను రద్దు చేయిస్తామన్నారు. పట్టణంలోని బళ్లా రి బైపాస్‌ సమీపంలో లే-అవుట్‌లు వేసిన స్థలాన్ని జాయింట్‌ కలెక్టర్‌ బుధవారం సం దర్శించారు.


లే-అవుట్‌ల మ్యాప్‌ను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక తహససీల్దారు కార్యాలయంలో ఇళ్ల స్థలాలపై ఆర్డీఓ గుణభూషణ్‌ రెడ్డి, ఇన్‌చార్జ్‌ తహసీల్దారు మధుసూధన్‌ రావుతో సమీక్షించారు. ఈ సమీక్షలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నా రు. అనంతరం జేసీ విలేకరులతో మాట్లాడుతూ గతంలో 3086 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశామన్నారు. ఇళ్ల స్థలాలకు సంబంధించి సర్వే నెంబరు 576, 575లలో సమస్యలున్నాయన్నారు.


పట్టాలలో చెక్‌బంద్‌లు, వివరాలు లేకపోవడం వల్ల స్థలాలు గుర్తించ డం ఇబ్బందిగా ఉందన్నారు. 1456 మందికి హౌసింగ్‌  కింద  మంజూర య్యాయన్నారు. భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు. మరో 1300 మంది లబ్ధిదారులకు సంబంధించి మ్యా పింగ్‌ కాలేదన్నారు.


వీటిపైనా విచారణ చేస్తామన్నారు. 90 రోజుల ప్రోగ్రాంలో దరఖాస్తు చేసుకోవాలని వారందరికి నవశకం కింద పట్టాలు రిజిస్ర్టేషన్‌ చేయిస్తామన్నారు. అర్హులైన వారందరికి ఇళ్ల స్థలాలతో పాటు పక్కా గృహాలు మంజూరు చేయిస్తామన్నారు. గతంలో ఇచ్చిన పట్టాలకు హ ద్దులు లేవని ఎన్నికల సమయంలో హ డావుడిగా పంపిణీ చేశారని వాటిని మార్చి పట్టాలివ్వాలని వైసీపీ నాయకలు జేసీకి విన్నవించారు. కార్యక్రమంలో ఇంచార్జ్‌ ఎంపీడీఓ దామోదర్‌రెడ్డి, మండల సర్వేయర్‌ మస్తానయ్య పాల్గొన్నారు.

Updated Date - 2020-10-01T09:42:38+05:30 IST