విస్తారంగా వర్షాలు

ABN , First Publish Date - 2020-10-01T09:35:27+05:30 IST

జిల్లా వ్యాప్తంగా బుధవారం విస్తారంగా వర్షా లు పడ్డాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి.

విస్తారంగా వర్షాలు

అనంతపురం వ్యవసాయం/పెద్దవడుగూరు, సెప్టెంబరు 30: 
జిల్లా వ్యాప్తంగా బుధవారం విస్తారంగా వర్షా లు పడ్డాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. అనంతపురం నగరంలో భారీ వర్షం కురిసింది. అలాగే పుట్లూరు, ఉరవకొండ యాడికి, వజ్రకరూరు, కదిరి, గుత్తి, గుంతక ల్లు, కుందుర్పి, విడపనకల్లు తదితర మండలాల్లో ఓ మోస్తరు వర్షం పడింది.  పామిడి, అమడగూరు, పుట్టపర్తి తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి.

మంగళవారం రాత్రి 57 మండలాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. అత్యధికంగా సోమందేపల్లిలో  81.6 మి.మీ., వర్షపాతం నమోదైంది. నల్లచెరువు 80.4, కొత్తచెరువు 79.2, పుట్టపర్తి 69.8, ధర్మవరం 67.4, పెనుకొండ 66.0, బుక్కపట్నం 65.6, సీకేపల్లి 64.6, బుక్కరాయసముద్రం 64.6, లేపాక్షి 58.4,  ముదిగుబ్బ 54.2, చిలమత్తూరు 54.2, నార్పల 52.4, రొద్దం 52.2, గోరంట్ల 52,0, పెద్దవడుగూరు 50.4 మి.మీ., వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాల్లో 49.2 మి.మీ.,లోపు కురిసింది. సెప్టెంబరులో జిల్లా సగటు వర్షపాతం 118.4 మి.మీ., కాగా 240.4 మి.మీ., నమోదైంది.


వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు
పెద్దవడుగూరు సమీపంలో ఉన్న పందుల వాగులో ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. అనంతపురం వెళ్లే బస్సు వంక దాటుతుండగా నీటి ఉధృతి పెరగటంతో నిలిచిపోయింది. స్థానికులు గమనించి, ట్రాక్టర్ల సాయంతో వాగు నుంచి బస్సును బయటకు లాగారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.మండలంలోని వీరన్నపల్లికి ఇరుపక్కలా ఉన్న కల్వర్టు వరద ఉధృతికి కోసుకుపోయింది. దీంతో గ్రామానికి రాకపోకలు స్తంభించాయి.

Updated Date - 2020-10-01T09:35:27+05:30 IST