‘హిందూ ధర్మం అంటే వైసీపీకి చిన్నచూపు’

ABN , First Publish Date - 2020-09-25T09:35:31+05:30 IST

సనాతన సంప్రాదాయాలు, హిందూధర్మంపై వైసీపీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని బీజేపీ నాయకులు మండిపడ్డా రు. గురువారం స్థానిక బీజేపీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడా

‘హిందూ ధర్మం అంటే వైసీపీకి చిన్నచూపు’

పుట్టపర్తి, సెప్టెంబరు 24: సనాతన సంప్రాదాయాలు, హిందూధర్మంపై వైసీపీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని బీజేపీ నాయకులు మండిపడ్డా రు. గురువారం స్థానిక బీజేపీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. అనాదిగా వస్తున్న హిం దూ సంపద్రాయాలు, దేవాలయాలలో ఉన్న ప్రాచీన సంప్రదాయాలను కించపరిచేవిధంగా అధికారపార్టీ మంత్రులు, నాయకులు విమర్శించడం శోచనీయమన్నారు.


ఇలాంటి సంఘటనలు ప్రజలు గమనిస్తున్నారని, ప్రజలే ఆ పార్టీకి తగిన బుద్దిచెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్రనాయకులు రత్నాకరం కొడమరాజు, కత్తిరాజారెడ్డి, పట్టణ అధ్యక్షుడు బాలగంగాదర్‌, నాయకులు జ్యోతిప్రసాద్‌, సత్యనారాయణరాజు, గంగిశెట్టి, నారాయణ, కల్యాణ్‌,  రామాంజినేయులు, నారాయణస్వామి,సుధాకర్‌, వడ్డిచిన్నాగప్ప పాల్గొన్నారు.



ముదిగుబ్బ: బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి హిందూమత విశ్వాసాలను అగౌరపరుస్తూ, దేవుళ్లను కిందపరుస్తూ రెచ్చగొట్టేవిదంగా మంత్రి కొడాలినాని చేసిన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు ఆందోళన చేశారు. గురువారం ముదిగుబ్బలో జాతీయరహదారిపై బీజే పీ నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్రకార్యవర్గసభ్యులు సోములప్రకాశ్‌ మాట్లాడుతూ  ప్రధాని మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లపై మంత్రికొడాలినాని అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు.


వెంటనే మంత్రిపదవిని నుంచి నానిని తొలగించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ముదిగుబ్బ ఇన్‌చార్జ్‌ ఎస్‌ఐ నగేశ్‌బాబుకు నానిపై పిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్‌ నారాయణస్వామి, దేవేంద్రనాథ్‌రెడ్డి, నాయకులు ద్వారక, మర్తాడుసత్తి, వెంకటేశ్‌, ఉప్పులపాడు ఆది, లేపాక్షి పోతలయ్య, అశోక్‌, గంగులప్ప పాల్గొన్నారు


పెనుకొండ: భారతప్రధాని నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ యోగిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నానిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ బీజేపీ, జనసేన నాయకులు ఆందోళన చేపట్టారు. గురువారం బీజేపీ నాయకులు రామాంజినేయులు, రామక్రిష్ణ, పాలూరి క్రిష్ణమూర్తి, శ్రీనివాసులు, హనుమంతు, గోవిందు, జితేంద్ర, జనసేననాయకులు కుమార్‌, రమేష్‌, మహేష్‌, హర్ష, ఆధ్వర్యంలో కార్యకర్తలు బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకుని మంత్రి నానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం సబ్‌కలెక్టర్‌ నిషాంతికి వినతిపత్రం అందించారు.

 

రొళ్ల: అధికార మదంతో హిందూదేవతలను, సంప్రదాయాలను అవమానపరుస్తూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండల అధ్యక్షుడు పట్టాభిరామ్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తక్షణమే అతనిపై చర్యలు చేపట్టాలని డిమాండు చేశారు. అనంతరం ఎస్‌ఐ మగ్బుల్‌బాషాకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్‌ నాయకులు ముద్దరాజు, నాగేంద్రబాబు, వెంకటేశ్వరస్వామి, ఉమేష్‌, రంగస్వామి, వీహెచ్‌పీ మండల నాయకుడు నరేష్‌ పాల్గొన్నారు.


కదిరి: హిందూ దేవాలయాలపై అనుచితంగా మాట్లాడిన కొడాలి నానిని మంత్రి పదవి నుంచి తప్పించాలని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్‌ డిమాండ్‌ చేశారు. కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి హిందువుల మనోభావాలను దెబ్బతినే విధంగా మాట్లాడుతున్న నానిపై చర్యలు తీసుకోవా లన్నారు. అనంతరం వివిధ డిమాండ్‌లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీఓ వెంకటరెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-25T09:35:31+05:30 IST