‘క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌’ అమలుకు అనంత సన్నద్ధం

ABN , First Publish Date - 2021-06-20T06:33:25+05:30 IST

నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో భాగంగా క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌)కు అనంతపురం నగరపాలక సంస్థ సన్నద్థమవుతోంది.

‘క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌’ అమలుకు అనంత సన్నద్ధం

రూ.1.62 కోట్లతో టెండర్‌ 

నగరానికి 2.46 లక్షల ప్లాస్టిక్‌ డస్ట్‌బిన్‌లు అవసరం 

రాష్ట్రవ్యాప్తంగా ఒకే కంపెనీకి సరఫరా బాధ్యతలు..?

అనంతపురం కార్పొరేషన్‌, జూన్‌ 19: నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో భాగంగా క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌)కు అనంతపురం నగరపాలక సంస్థ సన్నద్థమవుతోంది. రాష్టప్రభు త్వం అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశాలిచ్చి ంది. జూలై 8వ తేదీ నుంచి ఈకార్యక్రమా లు అమలు చేయనున్నారు. తాజాగా నాలుగో డివిజన్‌లో పైలెట్‌ ప్రాజెక్టు కింద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, పలువురికి ప్లాస్టిక్‌ డస్ట్‌బిన్‌లు అందజేశారు. ఈ మేరకు నగరంలోని అన్ని కుటుంబాలకు డస్ట్‌బిన్‌లు అందజేయడానికి కార్పొరేషన్‌ అధికారులు రంగం సిద్ధం చేశారు. రెండ్రోజుల క్రితం కార్పొరేషన్‌ అధికారులు రూ.1.62 కో ట్లతో టెండరు పిలిచారు. ఒక్కో కుటుంబానికి మూడు డస్ట్‌బిన్‌లు అందజేయనున్నారు. నగరంలో మొత్తం 80 వేల కుటుంబాలకు మూడు బిన్‌ల చొప్పున అందజేయనున్నట్లు తెలుస్తోంది. ఇంటి నుంచే తడి చెత్త, పొడి చెత్త, పనికిరాని వ్యర్థాలను వేరు చేయనున్నారు. మూడు డస్ట్‌బిన్‌లలో ఒక దానిలో తడి చెత్త, మరో దాంట్లో పొడి చెత్త, ఇంకో దాంట్లో గాజు, ఎలక్ర్టిక్‌ తదితర వ్యర్థాలను వేయడానికి ఉపయోగించాల్సి ఉంటుంది. ఆ చెత్తను కార్పొరేషన్‌ సిబ్బంది ఇంటింటి చెత్త సేకరణలో భాగం గా తీసుకెళ్తారు.


రాష్ట్రవ్యాప్తంగా ఒకే కంపెనీకి...?

ప్లాస్టిక్‌ డస్ట్‌బిన్‌ల విషయంలో టెండర్‌ ఎవరు దక్కించుకుంటారనే చర్చ ప్రస్తుతం సాగుతోం ది. సాధారణంగా అధికార పార్టీ నేతల సిఫార్సులతో టెండర్‌ దక్కించుకునే ప్రయత్నాలు సాగుతుంటాయి. 15వ ఆర్థిక సంఘం నిధులను డస్ట్‌బిన్‌లకు వె చ్చించనున్నారు. గ్రీన్‌, బ్లూ, రెడ్‌ రంగుల డస్ట్‌బిన్‌లలో  ఒక్కో రంగు వాటిని 81 వేల చొప్పున కొనుగోలు చేస్తారు. ఆ తరహాలో స్థానికంగా డస్ట్‌బిన్‌లు కొనుగోలు చేసి, సరఫరా చేయించే అనుభవం ఉన్న కాంట్రాక్టర్లు ఎవరున్నారనేది ఆసక్తికరం. రాష్ట్ర ప్రభు త్వం రాష్ట్రవ్యాప్తంగా ఒక కంపెనీకి అప్పగించాలనే యోచనలో ఉ న్నట్లు సమాచారం. జూలై 1వ తేదీకి టెండరుకు ఆఖరి గడువుగా విధించారు. మరి నిర్దేశించిన కంపెనీనే బిడ్‌ దాఖలు చేస్తుందా...? ఇతర కాంట్రాక్టర్లు రంగంలోకి దిగుతారా..? అనేది తేలాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.

Updated Date - 2021-06-20T06:33:25+05:30 IST