రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2021-05-14T06:41:21+05:30 IST

రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రహదారులు, భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ పేర్కొన్నారు.

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
రైతు భరోసా చెక్కును విడుదల చేస్తున్న మంత్రి శంకర్‌నారాయణ, ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌

ఈ ఏడాది తొలి విడత రైతు భరోసా సొమ్ము విడుదల 

మంత్రి  శంకరనారాయణ 

అనంతపురం వ్యవసాయం, మే 13:   రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రహదారులు, భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ పేర్కొన్నారు. గురువారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ఈ ఏడాది తొలి విడత వైఎ్‌సఆర్‌ రైతు భరోసా సొమ్మును విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి శంకర్‌నారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కింద ఈ ఏడాది తొలి విడతలో 52.38 లక్షల మంది రైతులకు రూ.3928 కోట్లు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేశామన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వడ్డీ లేని పంట రుణాలు, ఉచిత బీమా సౌకర్యం కల్పిస్తోందన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించడంతోపాటు రైతులకు పంటల సాగుపై సలహాలు, సూచనలు ఇస్తోందన్నారు. కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం అందజేస్తోందన్నారు. జిల్లా కలెక్టర్‌ గంధం చం ద్రుడు మాట్లాడుతూ జిల్లాలో 572816 మంది రైతు కుటుంబాలకు  రూ.429.62 కోట్లు జమ చేశామన్నారు. ఇందులో రూ.315.10 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తరపున, మిగిలిన రూ.114.52 కోట్లు పీఎం కిసాన్‌ నుంచి విడుదలైందన్నారు. ఒక్కో కుటుంబానికి తొలి విడతలో రూ.7500 జమ చేశామన్నారు. ఇందులో రూ.5500 రాష్ట్ర ప్రభుత్వం తరపున, మరో రూ.2 వేలు పీఎం కిసాన్‌ ద్వారా జమ చేయడం జరిగిందన్నారు. వీసీలో ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి, ఎంపీలు రంగయ్య, గోరంట్ల మాధవ్‌, ఎమ్మెల్యేలు తిప్పేస్వామి, తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి, ఉషాశ్రీ చరణ్‌, జేసీ నిశాంత్‌కుమార్‌, పలువురు రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-14T06:41:21+05:30 IST