కేజీబీవీ విద్యార్థినులకు యూట్యూబ్‌ పాఠాలు

ABN , First Publish Date - 2021-06-20T06:48:50+05:30 IST

పేదవిద్యార్థుల కోసం సమగ్రశిక్ష అధికారులు వినూత్న ప్రయోగం చేశారు.

కేజీబీవీ విద్యార్థినులకు యూట్యూబ్‌ పాఠాలు
ఆన్‌లైన్‌ క్లాసులు వింటున్న కేజీబీవీ విద్యార్థినులు

జిల్లా సమగ్రశిక్ష అధికారుల వినూత్న ప్రయోగం

బోధనకు 40 మంది రిసోర్స్‌పర్సన్‌ల నియామకం

జిల్లాలో తొలిసారి యూట్యూబ్‌ చానల్‌ ఏర్పాటు

అనంతపురం విద్య, జూన్‌ 19: పేదవిద్యార్థుల కోసం సమగ్రశిక్ష అధికారులు వినూత్న ప్రయోగం చేశారు. కొ విడ్‌ కారణంగా కేజీబీవీలు పునఃప్రారంభం కాకపోవటం తో ఆన్‌లైన్‌ ద్వారా పాఠ్యాంశాలు బోధించేందుకు కృషి చే స్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక యూట్యూబ్‌ చానల్‌ను ప్రారంభించారు. వేలాది మంది పిల్లలకు ఉపయోగపడేలా సమర్థవంతంగా నడుపుతున్నారు. ముఖ్యంగా 10వ తరగతి పరీక్షలు రా యబోయే విద్యార్థులకు పునఃచ్ఛరణ పాఠ్యాం శాలతోపాటు 7, 8, 9 తరగతుల విద్యార్థుల కు రెగ్యులర్‌ క్లాసులు సాగేలా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు.


40 మంది నిపుణులు...

జిల్లావ్యాప్తంగా 62 కేజీబీవీలున్నాయి. వీటి పరిధిలో సుమారు 13 వేల మంది చదువుతున్నారు. ఈ క్రమం లో ఆన్‌లైన్‌ బోధన కోసం ‘కేజీబీవీ అనంతపురం’ అనే యూట్యూబ్‌ చానల్‌ను ఏర్పాటు చేశారు. సబ్జె క్టు ఆధారంగా 40 మంది నిపుణులు, బోధనకు ఆసక్తి చూపుతున్న టీచర్లను రిసోర్స్‌పర్సన్లుగా నియమించారు. వారు నిత్యం వారికి కేటాయించిన సబ్జెక్టులపై పాఠ్యాంశాలను రికార్డు చేసి, చానల్‌లో ఉంచుతున్నారు. దీంతో వేలాదిమంది విద్యార్థినులు యూట్యూబ్‌ చానల్‌ను స్మార్ట్‌ఫోన్లు, ఇతర ఆన్‌లైన్‌ మాధ్యమాల ద్వారా వింటున్నారు. ఈ ప్రయోగం ద్వారా విద్యార్థులు ఎక్కడుం టే... అక్కడికే పాఠాలు అందుబాటులోకి వస్తున్నాయి. దీం తో పేద విద్యార్థులు సైతం చక్కగా పాఠాలు వింటూ చదువుకుంటున్నారు. ఈ యూట్యూబ్‌ చానల్‌ ప్రయోగం కేజీబీవీల విద్యార్థినులకు ఉపయుక్తంగా మారుతోంది.



విద్యార్థుల కోసమే ఈ ప్రయత్నం

కరోనా కారణంగా విద్యార్థులకు పాఠ్యాంశాలు దూరం కాకూడదు. కేజీబీవీ ల్లో విద్యాబోధన అందుబాటులోకి తే వాలన్న ఉద్దేశంతో ఈ ప్రయ త్నం చేశాం. 40 మంది సబ్జెక్టు నిపుణులను రిసోర్స్‌ పర్సన్లుగా నియమించి, విద్యార్థులకు బో ధన అందేలా చూస్తున్నాం. వారి సంఖ్య మరింత పెంచు తాం. విద్యార్థుల నుంచి కూడా స్పందన బాగుంది.

- తిలక్‌విద్యాసాగర్‌, ఏపీసీ, సమగ్రశిక్ష

Updated Date - 2021-06-20T06:48:50+05:30 IST