ఆదర్శంగా జగనన్న కాలనీల నిర్మాణం

ABN , First Publish Date - 2021-07-28T06:40:45+05:30 IST

రాష్ట్రంలో కనీ విని ఎరుగని రీతిలో ఆదర్శంగా జగనన్న కాలనీలను నిర్మి స్తున్నామని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి శ్రీరంగనాథరా జు పేర్కొన్నారు.

ఆదర్శంగా జగనన్న కాలనీల నిర్మాణం
సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి శ్రీరంగనాథరాజు

మూడేళ్లలో 30 లక్షల ఇళ్లు నిర్మిస్తాం  

రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు

అనంతపురం క్లాక్‌టవర్‌, జూలై27: రాష్ట్రంలో కనీ విని ఎరుగని రీతిలో ఆదర్శంగా జగనన్న కాలనీలను నిర్మి స్తున్నామని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి శ్రీరంగనాథరా జు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్తు ఆ వరణలోని డీపీఆర్‌సీ భవనంలో నవరత్నాలు- పేదలంద రికీ ఇళ్ల భాగంగా జగనన్న కాలనీల్లో గృహనిర్మాణంపై స మీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర రహదారులు, భవ నాల శాఖ మంత్రి శంకరనారాయణ, ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి, కలెక్టర్‌ నాగలక్ష్మిలతో కలిసి మంత్రి శ్రీరం గనాథరాజు సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశ చరి త్రలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇల్లు లేని పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే ఉద్దేశ్యంతో సీఎం జగన్‌ ప్రారం భించిన నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కింద జగనన్న కా లనీల్లో ఇళ్ల నిర్మాణం మహాయజ్ఞంలా సాగుతోందన్నారు. రాష్ట్రంలో రూ.12వేల కోట్ల విలువ చేసే భూములను పేద ల ఇళ్ల నిర్మాణాలకు కేటాయించామన్నారు. ప్రతి వారం ఇళ్ల నిర్మాణాలపై సీఎం జగన్‌ ప్రత్యేకంగా సమీక్షించి పు రోగతిని పరుగులు పెట్టిస్తున్నారన్నారు. మధ్య దళారులు లేకుండా నేరుగా లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ సామాగ్రి అందిస్తున్నామన్నారు. ప్రతి లే అవుట్‌ వద్ద ఒక మండల స్థాయి అధికారికి పర్యవేక్షణ బాధ్యత అప్పగించామన్నారు. ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యేకు ఇళ్ల నిర్మాణంపై అవగా హన ఉందని, ఏ చిన్న సమస్య రాకుండా చూసుకోవాలని ఇప్పటికే సూచించామని తెలిపారు. మూడేళ్లలో రాష్ట్రంలో 30లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. జగనన్న కాలనీల్లో రూ.30వేల కోట్లతో ప్రత్యేక మౌలిక వసతులు ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. 


నిర్ణీత గడువులో ఇళ్ల నిర్మాణం పూర్తి

- మంత్రి శంకరనారాయణ

నిర్ణీత గడువులోపు లబ్ధిదారులకు కేటాయించిన స్థలంలో ఇంటి నిర్మాణం పూర్తి చేయిస్తామని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ తెలిపారు. క్షేత్రస్థాయిలో మ్యాపింగ్‌, ఇతర లబ్ధిదారులతో లింకు కాబడిన ఆధార్‌ సమస్యలు అధికారులు వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఇసుక, మెటల్‌ లభ్యతలో ఎప్పటికప్పుడు సమాచారం అందించి సకాలంలో లబ్ధిదారులకు సరఫరా చేయాలన్నారు.  ఇళ్ల నిర్మాణంలో జిల్లాను ప్రథమస్థానంలో నిలిపేందుకు అధికారులందరూ కృషి చేయాలని సూచించారు. కలెక్టర్‌ నాగలక్ష్మి మాట్లాడుతూ గృహనిర్మాణ శాఖ అధికారులు ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని ఆదేశించారు. నియోజకవర్గాల వారిగా సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహించి వెంటనే పరిష్కరించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఆప్షన్‌-3 ఎంచుకున్న లబ్ధిదారుల మ్యాపింగ్‌ కూడా త్వరలో పూర్తి చేస్తామన్నారు. సీఎం ఆదేశాల మేరకు సెప్టెంబరు నాటికి ఇళ్ల నిర్మా ణాలు బేస్‌మెంట్‌ స్థాయికి తెచ్చేందుకు చర్యలు చేపడతామన్నారు. అంతకు ముందు హౌసింగ్‌ జేసీ నిశాంతి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు నిర్మాణంలో భాగంగా పనులు, పురోగతిపై వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఇక్బాల్‌, ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, తిప్పేస్వామి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి, సిద్దారెడ్డి, వై వెంకటరామిరెడ్డి, ఉషశ్రీచరణ్‌, జొన్నల గడ్డ పద్మావతి, మేయర్‌ వసీం, జాయింట్‌ కలెక్టర్లు నిషాంత్‌ కుమార్‌, సిరి, గంగాధర్‌గౌడ్‌, సబ్‌కలెక్టర్‌ నవీన్‌, హౌసింగ్‌ పీడీ వెంకటేశ్వరరెడ్డి, ఈఈలు, డీఈలు, ఏఈలు, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్‌ చైర్మెన్లు, కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-28T06:40:45+05:30 IST