గ్యాస్‌ మోత... సబ్సిడీ కోత

ABN , First Publish Date - 2021-03-01T06:24:03+05:30 IST

గ్యాస్‌ ధరల పెంపుతోపాటు సబ్సి డీ మొత్తంలో ప్రభుత్వం భారీ గా కోత విధించింది.

గ్యాస్‌ మోత... సబ్సిడీ కోత

ఒకే నెలలో మూడు సార్లు 

ధర పెంచిన కేంద్రం

గతేడాది సిలిండర్‌పై రూ.220 జమ 

ప్రస్తుతం రూ.47తో సరిపెడుతున్న ప్రభుత్వం 

లబోదిబోమంటున్న వినియోగదారులు 

అనంతపురం వ్యవసాయం, ఫిబ్రవరి 28  :  గ్యాస్‌ ధరల పెంపుతోపాటు సబ్సి డీ మొత్తంలో ప్రభుత్వం భారీ గా కోత విధించింది. దీంతో పేద, సామాన్య ప్రజలపై పెనుభారం పడుతోంది. గతేడాది సిలిండర్‌పై రూ.220ల వరకు సబ్సిడీ సొమ్ము వినియోగదారుల బ్యాంకు ఖా తాల్లో జమ చేసేవారు. గత ఎనిమిది నెలలుగా సబ్సిడీని భారీగా తగ్గించారు. ప్రతి నెలా వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరను పెంచుతున్నా సబ్సిడీని పెంచకపోవడం గమనార్హం. గత కొన్ని నెలలుగా ఒక్కో సిలిండర్‌కు కేవలం రూ.47లు సబ్సి డీ మొత్తాన్ని వినియోగదారుల బ్యాంకు ఖాతాలో జమ చే స్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 88 గ్యాస్‌ ఏజెన్సీలు ఉన్నాయి. వీటి పరిధిలో 12.30 లక్షల వంట గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నా యి. ప్రతి రోజూ 22వేల గ్యాస్‌ సిలిండర్లను డెలివరీ చే స్తున్నారు. ఈ లెక్కన నెలకు 6.60 లక్షల సిలిండర్లు డెలి వరీ అవుతున్నాయి. గతంలో ఇచ్చే సబ్సిడీ రూ.220 మేరకు అయితే రో జు రూ.48.40 లక్షలు, నెలకు  రూ.14.52 కోట్లు  వినియోగదారులకు అందేది. ప్రస్తుతం ఒక్కో సిలిండర్‌పై రూ.47లు సబ్సిడీ వర్తిపజేస్తున్నారు. ఈ లెక్కన రోజుకు రూ.10.34 లక్షలు, నెలకు రూ.3.10 కోట్ల దాకా సబ్సిడీ సొమ్ము జమ చేయడంతో సరిపెడుతు న్నారు.  తద్వారా వినియోగదారులు తీవ్రంగా నష్టపోతు న్నారు. 


తరచూ ధర పెంపుతో వినియోగదారుల బెంబేలు 

వంట గ్యాస్‌ధరను తరచూ పెంచుతుండటంతో విని యోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఇదివరకు వంట గ్యాస్‌ ధర రూ.836గా  ఉండేది. తాజాగా రూ.25లు పెంచడంతో రూ.861కి చేరింది.   గతంలో ఎన్న డూ లేని విధంగా ఈ నెలలో ఇప్పటి వరకు మూడు సార్లు వంట గ్యాస్‌ ధరలు పెంచారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి తొలుత వంట గ్యాస్‌ ధర రూ.761లుగా నిర్ణయించారు. ఈనెల 4వతేదీ సిలిండర్‌పై అదనంగా రూ.25లు పెం చారు. ఆ తర్వాత ఈనెల 14న అదనంగా రూ.50లు పెం చారు. తాజాగా మరో రూ.25లు పెంచడం గమనార్హం.



కట్టెల పొయ్యే గతి : తిప్పమ్మ, మాలాపురం, విడపనకల్లు 

కూలి పనులకు వెళ్లి బతుకుతున్నాం. ఇంటిళ్లిపాది రోజు కూలికి వెళితేనే కుటుంబం గడిస్తుంది. ప్రతి నెలా గ్యాస్‌ ధర  పెంచుతున్నారు. ముందుగా డబ్బంతా కడితేనే సిలిండర్‌ ఇస్తున్నారు. ఆ తర్వాత ఆలస్యంగా బ్యాంక్‌ ఖాతాలోకి సబ్సిడీ సొమ్ము పడుతోంది. ధరలు పెంచడంతోపాటు సబ్సిడీ  డబ్బులు తక్కువగా వేస్తున్నా రు. ఇలాగైతే కట్టెల పొయ్యే మాలాంటి వారికి గతి. ప్రభు త్వం పేదోళ్లపై కనికరం చూపించి న్యాయం చేయాలి





ఇంత అన్యాయమా :  సావిత్రి, శింగనమల 

ఇటుకలబట్టిలో కూలి పనులకి వెళ్లి కుటుంబాన్ని పో షించు కుంటున్నాం. ఇంత అన్యాయంగా గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెంచితే పేదోళ్లం ఎలా బతకాలి. కూరగాయలు, ఇతర  నిత్యావసర వస్తువుల ధరలు పెంచేశారు. ఇప్పుడు ఇంట్లో వాడుకునే గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంచడంతోపాటు సబ్సిడీ డబ్బులు తగ్గించడం అన్యాయం. 

Updated Date - 2021-03-01T06:24:03+05:30 IST