గుట్టుగా భర్తీ

ABN , First Publish Date - 2021-03-01T06:21:11+05:30 IST

జిల్లాలో విద్యా శాఖ, సమగ్రశిక్ష ప్రాజెక్టుల్లో ఏం జరుగుతోందో శాఖలో పని చేసే అధికారులకే తెలియకుండా పోతోంది.

గుట్టుగా భర్తీ
కలెక్టర్‌ పేరుమీద ఎంఐఎస్‌ కోఆర్డినేటర్‌గా నియమించినట్లుగా జారీ అయిన ఉత్తర్వులు

నోటిఫికేషన్‌ ఇవ్వకుండానే ఉద్యోగంలో నియామకం 

జీతం ఇచ్చే అధికారులకే ఈ విషయం తెలియదట 

గార్లదిన్నె ఎంఐఎస్‌ కో ఆర్డినేటర్‌ భర్తీపై అధికారుల్లో అస్పష్టత

విధుల్లో చేర్చుకున్నామంటున్న ఎంఈఓ, తెలియదంటున్న ఏపీసీ

అనంతపురం విద్య, ఫిబ్రవరి 28: జిల్లాలో విద్యా శాఖ, సమగ్రశిక్ష ప్రాజెక్టుల్లో ఏం జరుగుతోందో శాఖలో పని చేసే అధికారులకే తెలియకుండా పోతోంది.  రూ. 23 వేల జీతం చెల్లించే ఓ పోస్టుకు ఎలాంటి నోటిఫికేషన్‌ ఇవ్వకుండా భర్తీ చేయడంపై భారీ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ భర్తీ విషయం ఏపీసీకి కూడా తెలియదంటే వ్యవహారం ఎంత గుట్టుగా నడిపారో అర్థం చేసుకోవచ్చు. ఎలాంటి నోటిఫికేషన్‌ ఇవ్వకుండా గార్లదిన్నె ఎమ్మార్సీలో ఇటీవల ఎంఐఎస్‌ కో-ఆర్డ్డినేటర్‌ పోస్టును ఓ వ్యక్తితో భర్తీ చేయడం చూస్తుంటే.... కొందరు అధికారులు ప్రలోభాలకు తలొగ్గి అనర్హుడికి పెద్దపీట వేశారనే ఆరోప ణలు వినిపిస్తున్నాయి. ఆ  పోస్టులో నియమించిన  వ్యక్తి ఉద్యోగంలో చేరాడని గార్లదిన్నె ఎంఈఓ చెబుతుంటే సమగ్రశిక్ష అధికారులు ఆ విషయమే మాకు తెలియదు అంటూ చెబుతుండటం విస్మయం కలిగిస్తోంది. ఈవిరుద్ధ అభిప్రాయాలను చూస్తుంటే....ఈ పోస్టు భర్తీ వెనుక బోగస్‌ తంతు నడిచిందన్నది స్పష్టమవుతోంది.


బరితెగింపేనా....!

మండల వనరుల కేంద్రం (ఎమ్మార్సీ) ఆన్‌లైన్‌ పనులు చేయడంలో ఎంఐఎస్‌ కో-ఆర్డ్డినేటర్‌ కీలకం. అన్ని రకా ల ఆన్‌లైన్‌  సమాచారం సేకరించడం కానీ, జిల్లా అధికా రులకు పంపడంలో ఈ పోస్టు ప్రధానమైంది.  గార్లదిన్నె ఎమ్మార్సీలో ఎంఐఎస్‌ కో-ఆర్డ్డినేటర్‌ పోస్టు కొంత కాలంగా ఖాళీగా ఉంది. అయితే ఈ పోస్టు భర్తీ చేయాలంటే నోటిఫికేషన్‌ విడుదల చేయాలి. నోటిఫికేషన్‌ విడుదలైతే.... దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు ఉద్యోగం ఇవ్వాలి. అయితే ఇలాంటివి ఏవీ లేకుండానే ఎంఐఎస్‌ కో-ఆర్డ్డి నేటర్‌ను ఇటీవలే భర్తీ చేశారు.  ఎంఐఎస్‌ కో-ఆర్డ్డినేటర్‌కు నెలకు జీతం రూ. 23 వేలు చెల్లిస్తారు.  రూ. 5 వేలు గౌరవవేతనం చెల్లించే వలంటీరు పోస్టును భర్తీ చేయ డానికే నోటిఫికేషన్‌ విడుదల చేస్తున్నారు. అలాంటిది ముందస్తుగా నోటిఫికేషన్‌ ఇవ్వకుండా నియామకం చేప ట్టడం, పైగా కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తిని నియమిం చడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 


నియామకంపై... విరుద్ధ అభిప్రాయాలు

గార్లదిన్నె ఎంఐఎస్‌ కో-ఆర్డినేటర్‌ భర్తీపై అధికారుల నుంచి విరుద్ధమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎంఐఎస్‌ కో-ఆర్డ్డినేటర్‌ ఎమ్మార్సీలో పనిచేస్తుంటే....వారికి జీతం చెల్లించే అధికారం సమగ్రశిక్ష అధికారులకు ఉంటుంది. అయితే సమగ్రశిక్ష అధికారులకు తెలియకుం డా భర్తీ చేశారట. గార్లదిన్నె ఎంఐఎస్‌ కో-ఆర్డ్డినేటర్‌గా కర్నూలుకు చెందిన జీ. రాజశేఖర్‌ అనే వ్యక్తిని నియమిం చారు. కలెక్టర్‌ గంధం చంద్రుడి పేరుతో ఉత్తర్వులు (ఖఇ.ూౌ :878/అ2/్కఔఎ.గిఐూఎ/అ్కఖిఖి/2020) జారీ చేశారు. 2020-21 ఏడాది పాటు కాంట్రాక్టు పద్ధతిన నియమించి నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ పోస్టు భర్తీ విషయం తమకు ఏమాత్రం తెలియదని సమగ్రశిక్ష అధికారులు చె బుతుంటే...గత నెలలోనే ఆ ఉద్యోగి జాయిన్‌ అయినట్లు గార్లదిన్నె ఎంఈఓ చెబుతున్నారు. జీతాలు చెల్లించే మాకు తెలియకుండా ఉద్యోగిని ఎలా భర్తీ చేస్తారంటూ సమగ్ర శిక్ష అధికారులు ముక్కున వేలేసుకుంటున్నారు.


24న విధుల్లో చేరారు 

ఎంఐఎస్‌ కో-ఆర్డ్డినేటర్‌ చాలా రోజులుగా లేరు. కలెక్టర్‌ పేరున ఉత్తర్వులు ఇచ్చారు. నోటిఫికేషన్‌ గురించి తెలియదు. ఆయనది కర్నూలు. ఈ నెల 24వ తేదీన విధుల్లో చేరారు. ఆయనకు రూ. 23 వేలు జీతం ఇస్తారు.

- చంద్రానాయక్‌, ఎంఈఓ, గార్లదిన్నె


మేము తీసుకోలేదు 

గార్లదిన్నె ఎంఐఎస్‌ కో-ఆర్డినేటర్‌ను మేము తీసుకో లేదు. ఎలాంటి నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదు. ఆ నియామకం గురించి మాకు తెలియదు.

- తిలక్‌ విద్యాసాగర్‌, ఏపీసీ, సమగ్రశిక్ష

Updated Date - 2021-03-01T06:21:11+05:30 IST