అడ్డదారుల్లో లెక్కల సార్లు

ABN , First Publish Date - 2021-04-17T06:04:33+05:30 IST

ఎన్నికల ఖర్చులో తేడా చూడాల్సిన బాధ్యత కలిగిన ఆడిట్‌ విభా గం అధికారులే ఆమ్యామ్యాలకు పాల్పడుతున్నట్టు జిల్లా లో విమర్శలు వినిపిస్తున్నాయి.

అడ్డదారుల్లో లెక్కల సార్లు

మున్సిపల్‌ ఎన్నికల వ్యయంపై అభ్యర్థుల నుంచి వివరాలు

ఆ ముసుగులో చేతివాటం

ప్రదర్శిస్తున్న ఆడిట్‌ అధికారులు

ఒక్కో అభ్యర్థి రూ.5 వేల నుంచి

రూ.15 వేల వరకు ఇవ్వాల్సిందే..!

నెలరోజులు గడిచినా 

ఖర్చుల వివరాలు సమర్పించడంలో 

అభ్యర్థుల అలసత్వం

అనంతపురం కార్పొరేషన్‌, ఏప్రిల్‌ 16: ఎన్నికల ఖర్చులో తేడా చూడాల్సిన బాధ్యత కలిగిన ఆడిట్‌ విభా గం అధికారులే ఆమ్యామ్యాలకు పాల్పడుతున్నట్టు జిల్లా లో విమర్శలు వినిపిస్తున్నాయి. మున్సిపల్‌ ఎన్నికలు గత నెల 10వతేదీ పూర్తవడం, అదే నెల 14న ఫలితాలు వెల్ల డైన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్య ర్థులు ప్రస్తుతం ఖర్చు వివరాలను స్టేట్‌ ఆడిట్‌ అధికా రులకు అప్పగిస్తున్నారు. కానీ అక్కడున్న అధికారులు, సి బ్బంది మాత్రం  మీ ఎన్నికల ఖర్చు సరే...! మాకేంటి అం టున్నారట. అంటే వివరాలన్నీ సరిగానే అందజేసినా ఎం తోకొంత ఇచ్చుకొమ్మంటున్నారట. ఎందుకివ్వాలని ప్రశ్ని స్తే. మీరు ఇంత తక్కువే ఖర్చు చేశారా ఏంటి..? ఎన్నికల్లో మీ ఖర్చు ఆరా తీస్తే చాంతాడవుతుంది అని బుకాయిస్తు న్నారట. దీంతో అటు గెలిచిన, ఇటు ఓడిన అభ్యర్థులంద రూ కిమ్మనకుండా వారు అడిగినంత ముట్టజెప్పి వెళ్తున్న ట్లు సమాచారం. నగరపాలక సంస్థతో పాటు అన్ని మున్సి పాలిటీలు, నగర పంచాయతీల్లోనూ ఇదే వ్యవహారం కొనసాగున్నట్లు తెలిసింది.


రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు

జిల్లాలో ఒక కార్పొరేషన్‌, 8 మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 1128 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. అనంతపురం నగరపాలక సంస్థలో 204 మంది, హిందూపురం మున్సిపాలిటీలో 160, కదిరి 144, ధర్మవరం 95, గుంతకల్లు 110, తాడిపత్రి 101, కళ్యాణదుర్గం 73, రాయదుర్గం 80, గుత్తి మున్సిపాలిటీ 56 మంది, మడకశిర నగర పంచాయతీ 53, పుట్టపర్తి నగర పంచాయతీలో 52 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు నగర పంచాయతీలో ఒక వార్డుకు పోటీ చేసే అభ్యర్థి రూ.లక్షలోపు, మున్సిపాలిటీల్లో ఒక వార్డుకు పోటీ చేసే అభ్యర్థి రూ.1.5 లక్షల్లోపు, కార్పొరేషన్‌లోని ఒక డివిజన్‌లో పోటీ చేసే అభ్యర్థి రూ.2 లక్షల్లోపు ఖర్చు చేయాలి. ఆ మేరకు ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఆడిట్‌ అధికా రులు అభ్యర్థుల నుంచి ఆ వివరాలు సేకరిస్తున్నారు. దీంతో అభ్యర్థులు తాము ఎన్నికల ప్రచారానికి చేసిన ఖర్చుకు సంబంధించి బిల్లులు, ఇతర వివరాలు అందజేస్తున్నారు. అన్నీ సరిగానే ఉన్నా ఆడిట్‌ విభాగం వారు మాత్రం తమకు కూడా ఆమ్యామ్యాలు ఇవ్వాల్సిందే అని అంటున్నారట. విశ్వసనీయ సమాచారం మేరకు ఒక్కో అభ్యర్థి నుంచి రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. వీరంతా జిల్లా పరిషత్‌ పరిధిలో ఉ న్న ఆడిట్‌ విభాగం సిబ్బందేనట. పంచాయతీ ఎన్నికలకు కూడా ఎన్నికల వ్యయంపై ఆడిట్‌లో దాదాపు వీరే పని చేసినట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. మరి అప్పుడు కూడా ఆమ్యామ్యాలు బాగానే ముట్టి ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. 


పూర్తయింది పాతిక శాతమే...

ఎన్నికల ఖర్చు వివరాలను అభ్యర్థులు 45 రోజుల్లోపు అందజేయాలని ఎన్నికల కమిషన్‌ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. కానీ ఇప్పటివరకు పూర్తయింది కేవలం పాతికశాత మేనని తెలుస్తోంది. ఈ విషయంలో అభ్యర్థుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో గెలుపొందిన  అభ్యర్థులతో పాటు ఓడిన అభ్యర్థులూ ఉన్నారు. అనంతపురం కార్పొరేషన్‌లో 204 మంది పోటీ చేయగా ఇప్పటివరకు 55 మందే వివరాలు సమర్పించినట్లు అధికారిక లెక్కలు చె బుతున్నాయి. హిందూపురంలో 40 మందే అందజేసినట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన మున్సిపాలిటీల్లోనూ 20 నుంచి 25 శాతం మంది అభ్యర్థులు మాత్రమే తమ లెక్కల వివరాలు చూపినట్లు తెలిసింది. ఇప్పటికే  నెలరోజులు పూర్తయింది. ఈనెల 29వ తేదీకి జిల్లా కలెక్టర్‌కు ఆ వివ రాలను అందజేయాల్సి ఉందని ఉన్నతాధికారులు చెబు తున్నారు. మరి ఆలోపు అందజేస్తారా..? అందకపోతే అధికారులేమైనా చర్యలు తీసుకుంటారా..? అనేది తేలాల్సి ఉంది.


ఆ లెక్కల సంగతేంటో...?

అభ్యర్థులు నిజంగానే రూ.లక్ష నుంచి రూ.2 లక్షల్లోపు ఖర్చు చేశారా..? ఇందులో ఏ మాత్రం నమ్మశక్యం లేదంటు న్నాయి మెజార్టీ వర్గాలు. నగర పంచాయతీ మొదలుకొని అనంతపురం నగరపాలక సంస్థ వరకు కొన్ని వార్డులు, డివిజన్లలో కొందరు అభ్యర్థులు రూ.60లక్షల నుంచి రూ.1కోటి వరకు ఖర్చు చేశారనే ప్రచారం జరిగింది. ప్రచా రానికి వాహనాలు, ఫ్లెక్సీలు, కరపత్రాలు, భోజనం, ఇతర ఖర్చులకు అభ్యర్థులకు అయిన ఖర్చు అంతంతే. కానీ ఓటు కోసం భారీ మొత్తాల్లో ఖర్చు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కొందరు ఒక ఓటుకు రూ.3వేలకు పైగానే ముట్టజెప్పారనే ప్రచారం ఉంది. ఇలా అభ్యర్థులు రూ.లక్షల్లోనే ఖర్చు పెట్టేశారు. ఇదంతా ఆఫ్‌ద రికార్డ్‌ కింద అనుకున్నారేమో అభ్యర్థులు. అందుకే ఆ వివరాలేవీ అధికారులకు ఇచ్చే లెక్కల్లో చూపడం లేదు. కార్పొరేషన్‌ లో కొందరు అభ్యర్థులు కేవలం రూ.1.5 లక్షలకే బిల్లు చూ పారట. వింతగా ఉంది కదూ. ఆ సంగతి వదిలేస్తే... మరి అనధికారికంగా చేసిన ఖర్చు గురించి ఎవరు ఆరా తీస్తారబ్బా..? ఎన్నికల కమిషన్‌ ఎంత సీరియ్‌సగా తీసుకున్నా అది ఇప్పట్లో జరగదనే వాదనా లేకపోలేదు. ఇలా ఓటుకు నోటు విషయంలో ఎంత ఖర్చు పెట్టారనేది బహిరంగం కాదనేది సుస్పష్టం.

Updated Date - 2021-04-17T06:04:33+05:30 IST