30న రెండో డిప్యూటీ మేయర్‌, రెండో వైస్‌చైర్మన్‌ ఎన్నిక

ABN , First Publish Date - 2021-07-24T06:24:57+05:30 IST

రెండో డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు శుక్రవారం ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.

30న రెండో డిప్యూటీ మేయర్‌, రెండో వైస్‌చైర్మన్‌ ఎన్నిక

అనంతపురం కార్పొరేషన్‌, జూలై 23: రెండో డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు శుక్రవారం ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని ఏకైక నగరపాలక సంస్థ అనంతపురంలో ఈనెల 30వ తేదీన రెండో డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకోనున్నారు. జిల్లా కలెక్టర్‌గానీ, జాయింట్‌ కలెక్టర్‌గానీ ఈనెల 26న రెండో డిప్యూటీ మేయర్‌ ప్రత్యేక సమావేశానికి సంబంధించి ఎన్నికైన సభ్యులు, ఎక్స్‌అఫీషియో సభ్యులకు నోటీసులు జారీ చేస్తారు. ఈనెల 30న ప్రత్యేక సమావేశంలో రెండో డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకోనున్నారు. జిల్లాలోని హిందూపురం, కదిరి, ధర్మవరం, తాడిపత్రి, కళ్యాణదుర్గం, రా యదుర్గం, గుంతకల్లు, గుత్తి మున్సిపాలిటీలు, మడకశిర, పుట్టపర్తి నగర పంచాయతీల్లో మున్సిపల్‌ రెండో వైస్‌చైర్మన్‌ ఎన్నిక నిర్వహించనున్నారు.

Updated Date - 2021-07-24T06:24:57+05:30 IST