సారొస్తారొస్తారా..?

ABN , First Publish Date - 2021-04-17T06:07:09+05:30 IST

ఆయనో శాఖకు ఉన్నతాధికారి. వేలాది మంది ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, లక్షలాది మంది విద్యార్థులకు ఒకరకంగా బాస్‌ అనే చెప్పాలి.

సారొస్తారొస్తారా..?
గురువారం 12.03 గంటలప్పుడు కూడా ఖాళీగా కుర్చీ

డీఈఓ కార్యాలయం వైపు రాని జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారి

పక్షం, 25 రోజులకు ఒకసారే దర్శనం

బాస్‌ను కలవాలంటే బహు కష్టం

ఫోన్‌ చేసినా స్పందించరు

సమస్యలపై వచ్చే వారికి తప్పని తిప్పలు

సామాన్య టీచర్‌, నాయకులు,  ప్రజాప్రతినిధులదీ అదే సమస్య

ఇదీ విద్యాశాఖలోని ఓ బాస్‌ తీరు

అనంతపురం విద్య, ఏప్రిల్‌ 16: ఆయనో శాఖకు ఉన్నతాధికారి. వేలాది మంది ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, లక్షలాది మంది విద్యార్థులకు  ఒకరకంగా బాస్‌ అనే చెప్పాలి. సామాన్య ఉపాధ్యాయుల నుంచి సంఘాల నాయకుల వరకూ, చిన్న విద్యార్థుల నుంచి ప్రజాప్రతినిధుల వరకూ అందరికీ అందుబాటులో ఉండాలి. భౌతికంగా ఆఫీ్‌సలో అందుబాటులో లేకుంటే...కనీసం ఫోన్‌లో అయినా అందుబాటులోకి రావాలి. కానీ బాగా బిజీనేమో ! ఎంత అంటే...ఒక వారం లేదా పక్షం రోజులు మరీ చెప్పాలంటే పాతిక రోజులకు ఒకసారి కూడా ప్రధా న కార్యాలయం  వైపు చూడలేనంత. ఎవరైనా మహిళా టీచర్‌కో, లేదా వృద్ధ ఉపాధ్యాయుడికో ఏదైనా సమస్య వస్తే ఆయనను కలవాలంటే గగనమే. తప్పనిసరిగా కల వాలంటే కనీసమంటే రూ. 200 ఆటోకు చార్జీ పెట్టుకుని 6 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. అక్కడ దొరికితే మేలు కనీసం సమస్యలు చెప్పుకోవచ్చు. లేదంటే ఫోన్‌లో దొరకడం కష్టం. కనీసం ఫోన్‌ రింగ్‌ అయినా వారికి సమా ధానం రాదు. ఇదీ నిత్యం విద్యాశాఖలో వందలాది మంది ఉపాధ్యాయులు, సంఘాల నాయకులు, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య.


ఎప్పుడూ సమగ్రశిక్షనే..

జిల్లా విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కారణం ఆయన ఎప్పుడూ ఆఫీ్‌సలో అందుబాటులో లేకపోవడమే. ఆయన వచ్చినప్ప టి నుంచి పట్టుమని వారం రోజులు కూడా ఆఫీ్‌సలో కూ ర్చున్న సందర్భాలు లేవు. పక్షం, 25 రోజుకోసారి వస్తే గగనమే. ఎప్పుడు చూసినా సమగ్రశిక్ష కార్యాలయంలోనే దర్శనమిస్తుంటారు. జిల్లా విద్యాశాఖలో బాస్‌గా ఉంటూ డీఈఓ ఆఫీస్‌ నుంచే పాలన చేయాల్సిన ఆయన పొద్దస్తమానం సమగ్రశిక్ష  నుంచి సాగిస్తుండ టంపై విమర్శలు వస్తున్నాయి.


సమస్య వస్తే చెప్పే వారే ఉండరు..

జిల్లాలో 5128 పాఠశాలలున్నాయి. వీటి పరిధిలో 6 లక్షల పైచిలుకు విద్యార్థులు ఉంటారు. ప్రభుత్వ రంగ టీచర్లతోపాటు, కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లు, ఎయిడెడ్‌ స్కూళ్లు, అన్‌ఎయిడెడ్‌ ప్రైవేట్‌ స్కూళ్లు, కార్పొరేట్‌ స్కూళ్లు ఉన్నాయి. ప్రభుత్వరంగ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులతో పాటు, ఇతర విద్యాసంస్థల్లో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ సుమారు 32000 మంది వరకూ ఉంటారు. స్కూళ్లలోనూ, యాజమాన్యాల వద్ద అన్యాయం జరిగినా, ఏదైనా సమస్య ఎదురైనా విద్యాశాఖలోని ఆ ఉన్నతాధికారినే కలవాలి. డీఈఓ ఆఫీ్‌సలో కలుద్దామని వెళితే ఆ చాంబర్‌ ఎప్పుడూ ఖాళీగా ఉంటుంది. ఇక ఆయన ఉండే సమగ్రశిక్ష ప్రాజెక్టు సుమారు 6 కిలోమీటర్ల దూరంలోని టీవీ టవర్‌ వద్ద ఉంది. అంత దూరం వెళ్లడానికి సామాన్య టీచర్లు, సం ఘాల నాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. త మ బాస్‌ ఎప్పుడు, ఎక్కడ ఉంటారోనంటూ సమస్యలు విన్నవించడానికి కూడా పలు సంఘాల నాయకులు ముందుకెళ్లడం లేదు.  ఫోన్‌ చేసినా సమాధానం ఉండక పోవటంతో చాలామంది టీచర్లు ఫోన్‌ చేసేది కూడా మ ర్చిపోయారు.  సామాన్య ఉపాధ్యాయులు, సంఘాల నా యకులకే కాదు అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతిని ధులకీ ఇదే సమస్య ఎదురవుతోంది. మొత్తంపై విద్యాశా ఖలో బాస్‌ తీరు బేజారు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.




Updated Date - 2021-04-17T06:07:09+05:30 IST