ప్రైవేటు ఆస్పత్రిపై విజిలెన్స్‌ దాడులు

ABN , First Publish Date - 2021-05-08T06:32:51+05:30 IST

: కొవిడ్‌ నేపథ్యంలో మరోసారి నగరంలోని సాయినగర్‌లోని శ్రీ సా యిరత్న ఆస్పత్రిపై (ప్రైవేటు) శుక్రవారం విజిలెన్స్‌ దాడులు సాగడం నగరంలో కలకలం రేపిం ది.

ప్రైవేటు ఆస్పత్రిపై విజిలెన్స్‌ దాడులు
తనిఖీ చేస్తున్న అధికారులు

కరోనా వైద్య సేవలపై ఆరా.. లోపాలు వెలుగు చూడటంతో యాజమాన్యంపై కేసు నమోదు

అనంతపురం క్రైం, మే 7: కొవిడ్‌ నేపథ్యంలో మరోసారి నగరంలోని సాయినగర్‌లోని శ్రీ సా యిరత్న ఆస్పత్రిపై (ప్రైవేటు) శుక్రవారం విజిలెన్స్‌ దాడులు సాగడం నగరంలో కలకలం రేపిం ది. పలు లోపాలు వెలుగుచూడటం చర్చనీయా ంశంగా మారింది. విజిలెన్స్‌ డీఎస్పీ హుసేన్‌పీరా, సీఐ రామారావు, ఎస్‌ఐ బాలకృష్ణ, ఏఈ రవీంద్రనాథ్‌,  డాక్టర్‌ దివాకర్‌, అసిస్టెంట్‌ డ్రగ్‌ కంట్రోలర్‌ రమే్‌షరెడ్డి బృందంగా ఏర్పడి, శుక్రవారం శ్రీసాయిరత్న ఆస్పత్రిపై దాడులు చేశారు. రికార్డులను పరిశీలించి, కరోనా బాధితులకు అంది ంచే వైద్యసేవలు, ఫీజలు తదితరాలపై ఆరాతీశారు. దీంతో పలు లోపాలు వెలుగు చూశాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న ధరకంటే అధికంగా వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. నాన్‌ ఐసీయూలో కూడా ఆక్సిజన్‌ బెడ్‌ పేషెంట్లకు రూ.15 వేల నుంచి 30 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తేలింది. ఆరోగ్యశ్రీ కింద చేరిన కొవిడ్‌  బాధితుల నుంచి కూడా డబ్బు లాగుతుండటం వెలుగుచూసింది. బాధితులకు ఇచ్చే ఇంజక్షన్‌కు రూ.21 వే లు వసూలు చేసినట్లు అధికారులు తెలియజేశా రు. ఆరు ఇంజక్షన్లకు సరైన రికార్డులు లేకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆస్పత్రి యాజమాన్యంపై కేసులు నమోదు చేసినట్లు విజిలెన్స్‌ డీఎస్పీ హుసేన్‌ పీరా తెలియజేశారు. ఆస్పత్రుల్లో అధిక వసూళ్లపై ఫిర్యాదు చేస్తే పరిశీలించి, చర్యలు తీసుకుంటామని ప్రజలకు తెలియజేశారు.

Updated Date - 2021-05-08T06:32:51+05:30 IST