వారానికి రూ.లక్ష పనులు చేయాల్సిందే

ABN , First Publish Date - 2020-11-29T06:53:55+05:30 IST

జిల్లాలో చేపట్టిన ప్రభుత్వ భవన నిర్మాణాలకు సంబంధించి వారానికి రూ.లక్ష వ్యయంతో కూడిన పనులను తప్పక పూర్తి చేయాల్సిందేనని ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లను కలెక్టర్‌ గం ధం చంద్రుడు ఆదేశించారు.

వారానికి రూ.లక్ష పనులు చేయాల్సిందే

ప్రభుత్వ భవన నిర్మాణాల్లో  నిర్లక్యం వహిస్తే చర్యలు

ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లకు కలెక్టర్‌ ఆదేశం

అనంతపురం, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): జిల్లాలో చేపట్టిన ప్రభుత్వ భవన నిర్మాణాలకు సంబంధించి వారానికి రూ.లక్ష వ్యయంతో కూడిన పనులను తప్పక పూర్తి చేయాల్సిందేనని ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లను కలెక్టర్‌ గం ధం చంద్రుడు ఆదేశించారు. ఆయన శనివారం సంబంధి త అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి, మాట్లాడారు. రైతు భరోసా కేంద్రాలు, గ్రామ, వార్డు సచివాలయాలు, హెల్త్‌ క్లినిక్‌లు, అంగన్‌వాడీ భవనాలు, నాడు-నేడుకు సం బంధించి ప్రభుత్వ భవనాల నిర్మాణాల పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఒక్కో ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ తన పరిధిలో ఉన్న ఒక్కో భవనానికి సంబంధించి వారానికి రూ.లక్ష పనులు పూర్తి చేయాలన్నారు. పనులకు సబంధించి బిల్లులను ప్రతి వారం అప్‌లోడ్‌ చేయాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. ఎస్‌ఈ, డీఈలు, ఏఈలు పనుల వేగవంతంపై ప్రత్యేక శ్ర ద్ధ తీసుకోవాలన్నారు. సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని, ఇసుక సమస్య లేకుండా చూడా ల న్నారు. రూ.లక్ష వ్యయం పనులను కూడా చేయించలేని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకూ చేపట్టిన పనులకు సంబంధించి బిల్లులు అప్‌లోడ్‌ చేయని ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని సంబంధిత శాఖ ఉన్నతాధికారిని ఆదేశించారు. టెలీకాన్ఫరెన్స్‌లోనే కనగానపల్లి ఏఈ నాగేంద్రబాబుకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని పీఆర్‌ ఎస్‌ఈ మహేశ్వరయ్యను ఆదేశించారు. అంతకుముందు జేసీలు నిశాంత్‌కుమార్‌, డాక్టర్‌ సిరి అన్ని మండలాల ఏఈలతో ప్రభుత్వ భవన నిర్మాణాల పురోగతిపై సమీక్షించారు. టెలీకాన్ఫరెన్స్‌లో పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు, సమగ్రశిక్ష ఇంజనీర్లు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-29T06:53:55+05:30 IST