మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను విజయవంతం చేయండి

ABN , First Publish Date - 2021-06-20T06:44:18+05:30 IST

జిల్లాలో కరోనా నియంత్రణకు ఆదివారం నిర్వహించే మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను విజయవంతం చేయాలని కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌ ఆదేశించారు.

మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను విజయవంతం చేయండి

- కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌ 

అనంతపురం వ్యవసాయం, జూన్‌ 19: జిల్లాలో కరోనా నియంత్రణకు ఆదివారం నిర్వహించే మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను విజయవంతం చేయాలని కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్‌ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌ నుంచి మున్సిపల్‌ కమిషనర్లు, ఎం పీడీఓలు, తహసీల్దార్లు, వైద్యాధికారులతో కలెక్టర్‌ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వ హించారు. ప్రతి సచివాలయ పరిధిలోని 45 సంవత్సరాలకు పైబడిన వారితోపాటు 0-5 సంవత్సరాల్లోపు చంటి బిడ్డలు కలిగిన తల్లులకు టీకా వేయాలన్నారు. ఆయా స్థానిక గ్రామ, వార్డు వలంటీర్లు, ఆశావర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్లు, వీఆర్‌ఓలు ముందస్తుగా స మాచారం తెలియజేసి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. జిల్లాకు లక్ష డోస్‌లు టార్గెట్‌ ఇచ్చారన్నారు. ప్రతి సచివాలయం పరిధిలో 100 మందికి తగ్గకుండా లక్ష్యం పెట్టుకుని, వ్యాక్సిన్‌ చే యించాలన్నారు. లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు అన్ని ప్రాంతాల్లో ముందస్తుగా దండోరా వేయించి, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కుర్చీలు, షామియానా, తాగునీరు తదితర సదుపాయాలు కల్పించాలన్నారు. మెగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో గ్రామ సర్పంచ్‌, వార్డు మెంబర్లు, కార్పొరేటర్లు, స్థానిక నాయకులను భాగస్వామ్యులను చేయాల న్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి కామేశ్వరప్రసాద్‌, నియోజకవర్గా ల ప్రత్యేకాధికారులు, ఆర్డీఓలు ఇతర అధికారులు పాల్గొన్నారు.


నేడు సంపూర్ణ కర్ఫ్యూ లేదు

మధ్యాహ్నం 2 గంటల వరకు సడలింపు..

జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు

అనంతపురం క్రైం, జూన్‌ 19: జిల్లావ్యాప్తంగా ఆదివారం పూర్తిస్థాయి కర్ఫ్యూ లేదనీ, మధ్యాహ్నం 2 గంటల వరకు ఆంక్షలను సడలించినట్లు జి ల్లా ఎస్పీ సత్యఏసుబాబు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ అదేశాల మేరకు.. ఈనెల 21 నుంచి 30వ తేదీ వరకు ఉదయం 6 నుంచి సా యంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలను సడలించనున్నట్లు ఆయన తెలియజేశారు. ఈక్రమంలో దుకాణాలు, షాపులు తదితర వ్యాపార సముదాయాలకు మాత్రం రోజూ సాయంత్రం 5 గంటల మాత్రమే అనుమతి ఇచ్చామన్నారు. వ్యాపారులు ఈ నిబంధన కచ్చితంగా పాటించాలన్నారు. సడలింపు సమయంలో యథావిధిగా వ్యాపారాలు కొనసాగించవచ్చన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.

Updated Date - 2021-06-20T06:44:18+05:30 IST