Abn logo
May 12 2021 @ 01:31AM

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్‌

అనంతపురం, మే 11(ఆంధ్రజ్యోతి): జిల్లాలో నాడు-నేడుతో పాటు ఇతరత్రా అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్‌ గంధం చంద్రు డు.. సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి జిల్లా కలెక్టర్‌, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కొవిడ్‌-19, ఉపాధిహామీ పనులు, గ్రామ సచివాలయ, రైతు భరోసా కేంద్రాల భవనాలు, బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు, వైఎ్‌సఆర్‌ హెల్త్‌ క్లినిక్‌, వైఎ్‌సఆర్‌ జలకళ, వైఎ్‌సఆర్‌ అర్బన్‌ క్లినిక్‌లు, నవరత్నాలు-పేదలందరికి ఇళ్ల పురోగతి, స్పందన తదితర అంశాలపై సమీక్షించారు. సీఎం వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ గంధం చంద్రుడితో పాటు జేసీలు నిశాంత్‌కుమార్‌, గంగాధర్‌ గౌడ్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సూర్యతేజ హాజరయ్యారు. సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం కలెక్టర్‌ వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో వివిధ ఇంజనీరింగ్‌ శాఖల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలన్నారు. నాడు-నేడు కింద పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు, రైతుభరోసా కేంద్రాల భవనాలతో పాటు వివిధ నిర్మాణపు పనులు త్వరితగతిన చేపట్టాలన్నారు. నవరత్నాలు-పేదలందరికి ఇళ్ల కింద ఇంటి నిర్మాణాలు చేపట్టేందుకు ఏర్పాటు చేసిన లేఅవుట్లలో నీటి సౌకర్యంతో పాటు ఇతరత్రా, సౌకర్యాలు కల్పించాలన్నారు. ఆరోగ్యశ్రీ, పెన్షన్‌, రేషన్‌కార్డులను నిర్దేశిత గడువులోగా ఇచ్చేలా చూడాలన్నారు. 90 రోజుల్లోపు దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఇళ్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొవిడ్‌ నేపథ్యంలో ఏర్పాటు చేసిన 104 కాల్‌సెంటర్‌కు వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద ఈ సీజన్‌లో కూలీలకు ఉపాధి పనులు ఎక్కువగా కల్పించాలన్నారు. సమావేశంలో డ్వామా పీడీ వేణుగోపాల్‌ రెడ్డి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌లు వరప్రసాద్‌, రవీంద్ర, ఆనంద్‌, డీఎంహెచ్‌ఓ కామేశ్వరప్రసాద్‌, వ్యవసాయశాఖ జేడీ రామకృష్ణ, ఐసీడీఎస్‌ పీడీ విజయలక్ష్మి, వైద్యకళాశాల ప్రిన్సిపాల్‌ నీరజ, డీసీహెచ్‌ఎ్‌స రమే్‌షనాథ్‌, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌ వెంకటేశ్వరరావు, హౌసింగ్‌ పీడీ చంద్రమౌళిరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement