కరోనాను ఎదుర్కొనేందుకు పకడ్బందీ చర్యలు

ABN , First Publish Date - 2021-07-25T06:13:55+05:30 IST

కరోనా థ ర్డ్‌ వేవ్‌ వచ్చే అవకాశమున్న నేపథ్యంలో దానిని ఎదుర్కొనేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి.. సంబంధిత అధికారులను ఆదేశించారు.

కరోనాను ఎదుర్కొనేందుకు పకడ్బందీ చర్యలు
మాట్లాడుతున్న కలెక్టర్‌ నాగలక్ష్మి

కలెక్టర్‌ నాగలక్ష్మి

కంటైన్మెంట్‌ స్ర్టాటజీని పక్కాగా అమలు చేయాలి

డీఐజీ కాంతిరాణాటాటా

అనంతపురం, జూలై 24(ఆంధ్రజ్యోతి): కరోనా థ ర్డ్‌ వేవ్‌ వచ్చే అవకాశమున్న నేపథ్యంలో దానిని ఎదుర్కొనేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి.. సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో నోడల్‌ అధికారులతో సమావేశమయ్యారు. కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన అంశాలపై డీఐజీ కాంతిరాణా టాటా, ఎస్పీ ఫక్కీరప్ప, జేసీలు డా. సిరి, నిశాంతి, గంగాధ ర్‌గౌడ్‌, డీఎ్‌ఫఓ సందీ్‌పకృపాకర్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సూర్యతేజతో కలిసి కలెక్టర్‌ సమీక్షించారు. కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు అధికారులంతా అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలన్నారు. రోజూ నమోదవుతున్న పాజిటివ్‌ కేసులకు సంబంధించి ప్రై మరీ, సెకెండరీ కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ చేయాలన్నారు. గ్రా మీణ ప్రాంతాల్లో కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ను మరింత మెరుగుపరచాలన్నారు. జిల్లాలో ప్రతి సోమ, మంగళ, బుధవారాల్లో ఐఈసీ యాక్టివిటీపై అవగాహన కార్యక్రమాలను చేపట్టాలన్నారు. కరోనా ఆస్పత్రుల్లో ఐసీయూ, ఆక్సిజన్‌ బెడ్లకు అమర్చిన పైపులైన్లను పరిశీలించాలన్నారు. కార్యక్రమంలో డీఐజీ కాంతిరాణా టాటా, ఎస్పీ ఫక్కీరప్ప, డీఎంహెచ్‌ఓ కామేశ్వర ప్రసాద్‌, నగర కమిషనర్‌ మూర్తి, డీసీహెచ్‌ఎ్‌స రమే్‌షనాథ్‌, జడ్పీ సీఈఓ భాస్కర్‌రెడ్డి, డీపీఓ పార్వతి, డీఆర్‌డీఏ పీడీ నరసింహారెడ్డి, నోడల్‌ అధికారులు వరప్రసాద్‌, రవీం ద్ర, శ్రీనివాసులు, ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్‌ కిరణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-07-25T06:13:55+05:30 IST