హిందూపురం ఆస్పత్రి నోడల్‌ అధికారి సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2021-05-08T06:28:23+05:30 IST

హిందూపురం ప్ర భుత్వాస్పత్రి నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తున్న హిందూపురం డివిజనల్‌ కో-ఆపరేటివ్‌ అధికారి రాజేంద్రప్రసాద్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది.

హిందూపురం ఆస్పత్రి నోడల్‌ అధికారి సస్పెన్షన్‌

ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్‌

అనంతపురం, మే 7(ఆంధ్రజ్యోతి): హిందూపురం ప్ర భుత్వాస్పత్రి నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తున్న హిందూపురం డివిజనల్‌ కో-ఆపరేటివ్‌ అధికారి రాజేంద్రప్రసాద్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. ఆ మేరకు జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వైద్యాధికారులతో సమన్వయం చేసుకుంటూ ఆస్పత్రిలోని రోగుల రోజువారీ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించడంలో విఫలమైన నేపథ్యంలో ఆయనను సస్పెండ్‌ చేసినట్లు ఉత్తర్వుల్లో స్ప ష్టం చేశారు. హిందూపురం డివిజన్‌ కో-ఆపరేటివ్‌ అధికారిగా పనిచేస్తున్న రాజేంద్రప్రసాద్‌ను గతంలో హిందూపురం జిల్లా ఆస్పత్రికి నోడల్‌ అధికారిగా ని యమించిన విషయం తెలిసిందే. కొవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన కా రణంగానే ఆయనను సస్పెండ్‌ చేశారు. హిందూపురం ప్రభుత్వాస్పత్రి నోడల్‌ అధికారిగా పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ నిశాంతిని నియమించారు. కొవిడ్‌ విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని జిల్లా కలెక్టర్‌ ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.


రెమిడిసివీర్‌ అవకతవకలపై చర్యలు

పురం ఆస్పత్రి స్టాఫ్‌నర్సు, ఫార్మసీ సూపర్‌వైజర్‌పై సస్పెన్షన్‌ వేటు

 కన్సల్టెంట్‌ ఫిజీషియన్‌కు హెచ్చరిక

హిందూపురం టౌన్‌, మే 7: హిందూపురం కొవిడ్‌ ఆస్పత్రిలో రెమిడిసివీర్‌ వ్యాక్సిన్‌ నిర్వహణలో అవకతవకలను జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు సీరియస్‌గా పరిగణించారు. ఇందుకు బాధ్యులైన స్టాఫ్‌నర్సు, ఫార్మసీ సూపర్‌వైజర్లను శుక్రవారం రాత్రి సస్పెండ్‌ చేశారు. ఆస్పత్రి కన్సల్టెంట్‌ ఫిజీషియన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. మహేష్‌ కుమార్‌ అనే వ్యక్తి తన తండ్రి సంజీవ ప్రసాద్‌కు  రెమిడిసివీర్‌ వ్యాక్సిన్‌ వేయకపోయినా వేసినట్లు రికార్డుల్లో చూ పారంటూ ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టాలని పెనుకొండ సబ్‌కలెక్టర్‌ నిశాంతిని కలెక్టర్‌ ఆదేశించారు. సబ్‌కలెక్టర్‌ ఆస్పత్రిని తనిఖీ చేసి, నివేదికను కలెక్టర్‌కు అందజేశారు.  రెమిడిసివీర్‌ వ్యాక్సిన్‌ వేసిన సంఖ్యకు, ఖాళీ వైల్స్‌కి తేడా ఉండటంతో ఫార్మసీ సూపరింటెండెంట్‌ రమాదేవి, డ్యూటీ డాక్టర్‌ ఆదేశాల మేరకు ఇంజక్షన్‌ వేయకపోవడమే కాకుం డా వేసినట్లు చెప్పినందుకు స్టాఫ్‌ నర్సు సునీత, రాణిని సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్యులు జారీ చేశారు. ఆస్పత్రి డ్యూటీ డాక్టర్‌గా కన్సల్టెంట్‌ ఫిజీషియన్‌ జక్కా నరేంద్ర కుమార్‌  రెమిడిసివీర్‌ ఇంజక్షన్‌ వేశారా, లేదా అని పరిశీలించకుండా నిర్లక్ష్యంగా వ్య వహరించడంతోనే సిబ్బంది అవకతవకలకు పాల్పడ్డారని భావించి, ఆయనను హెచ్చరిస్తూ ఉత్తర్యులు జారీ చేశారు.

Updated Date - 2021-05-08T06:28:23+05:30 IST