కరోనాకు సంప్రదాయ వైద్యంలో పరిష్కారాలు

ABN , First Publish Date - 2021-04-21T06:28:43+05:30 IST

సంప్రదాయ వైద్యంలో కరోనాకు సులభమైన తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారాలున్నాయని, వాటిని ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని కలెక్టర్‌ గంధం చంద్రుడు ఆయుష్‌ వైద్యాధికారులకు ఆదేశించారు.

కరోనాకు సంప్రదాయ వైద్యంలో పరిష్కారాలు

- కలెక్టర్‌ గంధం చంద్రుడు

అనంతపురం అర్బన, ఏప్రిల్‌ 20: సంప్రదాయ వైద్యంలో కరోనాకు సులభమైన తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారాలున్నాయని, వాటిని ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని కలెక్టర్‌ గంధం చంద్రుడు ఆయుష్‌ వైద్యాధికారులకు ఆదేశించారు. మంగళవారం ఆయుష్‌ శాఖ అధికారులు కరోనా రోగ నిరోధక శక్తి కిట్‌ను కలెక్టర్‌కు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కరోనా నివారణకు రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం అత్యున్నత మార్గమన్నారు. కరోనాకు వ్యతిరేకంగా అందుబాటులోనున్న వైద్య పద్ధతుల ద్వారా యుద్ధం చేయాల్సిన అవసరముందన్నారు. రోజుకొక కొత్త సవాలు విసురుతున్న కరోనా వైరస్‌ నుంచి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు రోగనిరోధక శక్తినిపెంచే మార్గాలు అనుసరించాలన్నారు. ఆయుర్వేదం, యునాని, సిద్ద, హోమియోపతి వంటి సంప్రదాయ వైద్య పద్ధతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రతిఫలం అందిస్తాయన్నారు. కార్యక్రమంలో ఆయుష్‌ వైద్యులు నాగేశ్వరరావు, రత్న చిరంజీవి, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-21T06:28:43+05:30 IST