పిల్లల సంరక్షణ కేంద్రాల ఏర్పాటు

ABN , First Publish Date - 2021-05-19T06:34:44+05:30 IST

కరోనా బారిన పడి తల్లిదండ్రులు చికిత్స పొందుతున్నా, మరణించినా అలాంటి వారి పిల్లల సంరక్షణ కోసం బుక్కరాయసముద్రంలోని ఆర్డీటీ భవనాల్లో రెండు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఐసీడీఎస్‌ పీడీవిజయలక్ష్మి మంగళవారం తెలిపారు.

పిల్లల సంరక్షణ కేంద్రాల ఏర్పాటు

అనంతపురం వైద్యం మే 18: కరోనా బారిన పడి తల్లిదండ్రులు చికిత్స పొందుతున్నా, మరణించినా అలాంటి వారి పిల్లల సంరక్షణ కోసం బుక్కరాయసముద్రంలోని ఆర్డీటీ భవనాల్లో రెండు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఐసీడీఎస్‌ పీడీవిజయలక్ష్మి మంగళవారం తెలిపారు. ఇప్పటికే 50 మంది పిల్లలకు ఈ కేంద్రాల్లో ఆశ్రయం కల్పిస్తున్నామనీ, బాలబాలికలకు ప్రత్యేక సంరక్షణ కేంద్రం నిర్వహిస్తున్నామన్నారు. అలాంటి పిల్లలుంటే  181, 1098 టోల్‌ఫ్రీ నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు. తల్లిదండ్రులు కరోనాతో చనిపోయి ఉంటే వారి పిల్లలకు పూర్తి సంరక్షణ కల్పిస్తామన్నారు. ప్రభుత్వం కూడా ప్రత్యేక పారితోషకం ఇచ్చి, ఆదుకుంటుందన్నారు.

Updated Date - 2021-05-19T06:34:44+05:30 IST