సీబీఎస్‌ఈ ప్రయోగం ఫలించేనా..?

ABN , First Publish Date - 2021-05-16T05:59:11+05:30 IST

మౌలిక సదుపాయాలు కల్పించకుండా, టీచర్లకు శిక్షణ ఇవ్వకుండానే వచ్చే విద్యా సంవత్సరం నుంచి సీబీఎ్‌సఈ సిలబ్‌సను ప్రవేశ పెట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై సంఘాల నాయకులు, నిపుణులు పెదవి విరుస్తున్నారు.

సీబీఎస్‌ఈ ప్రయోగం ఫలించేనా..?

గతంలో విఫలం.. ప్రస్తుతం మళ్లీ తెరపైకి..

 2021-2022 విద్యా సంవత్సరం నుంచి అమలుకు ప్రభుత్వం అడుగులు

క్షేత్రస్థాయిలో శిక్షణ, వనరుల ఏర్పాటు శూన్యం 

హెచ్‌ఎంలను గూగుల్‌ ఫాంలో వివరాలు పంపాలన్న విద్యాశాఖ

అనంతపురం విద్య, మే 15: మౌలిక సదుపాయాలు కల్పించకుండా, టీచర్లకు శిక్షణ ఇవ్వకుండానే వచ్చే విద్యా సంవత్సరం నుంచి సీబీఎ్‌సఈ సిలబ్‌సను ప్రవేశ పెట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై సంఘాల నాయకులు, నిపుణులు పెదవి విరుస్తున్నారు. 2021-2022 ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 7వ తరగతి నుంచి సీబీఎ్‌ససీ సిలబస్‌ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 2024-25 నాటికి పదో తరగతి మొదటి బ్యాచ్‌ బయటకు వచ్చేలా రాష్ట్ర విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. విద్యాశాఖ నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి.


గతంలో విఫలయత్నం...

వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభ్వుత్వ పాఠశాలల్లో సీబీఎ్‌సఈ సిలబస్‌ ప్రవేశపెడితే అది ఎంతవరకూ సఫలీకృతమవుతుందన్న దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2009లో సీబీఎ్‌సఈ పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలన్న డిమాండ్‌పై అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సైతం ఇదే ప్రయత్నం చేశారు. కొన్ని పాఠ్యపుస్తకాలను సైతం ముద్రణ చేయించారు. 6వ తరగతి నుంచి అమలు చేయాలని భావించా రు. తర్వాత ఈ విషయంలో ఆయన వెనక్కు తగ్గారు. దీంతో అప్పుడు ఇది అటకెక్కింది. ఇప్పుడు మళ్లీ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎ్‌సఈ సిలబస్‌ ప్రవేశపెట్టడానికి యత్నాలు చేస్తోంది. క్షేత్రస్థాయిలో ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా ముందుకు వెళ్లనుండటంపై విమర్శలు వస్తున్నాయి.


మౌలిక వసతులు, వనరులేవీ..?

వచ్చే ఏడాది నుంచి సీబీఎ్‌సఈ సిలబస్‌ ప్రవేశపెట్టాలన్న యోచనకు తగ్గట్లు రాష్ట్రంలోని స్కూళ్లలో ఏర్పాట్లు లేవు. పాఠ్యాంశాలు ఆంగ్లంలో ఉం టాయి. దీనికంటే ముఖ్యంగా సీబీఎ్‌సఈ పాఠ్యాంశాలు బోధించే సా మర్థ్యం అధికశాతం టీచర్లకు లేదన్నది సత్యం. వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలి. పైగా ఆ స్థాయిలో స్కూళ్లలో మౌలిక వసతులు, ల్యాబ్‌లు పెంచా లి. ఇప్పటి వరకూ ఆ దిశగా అడుగులు పడలేదనే చెప్పాలి. వచ్చే ఏడాది నుంచి అమలు చేయనున్న నేపథ్యంలో ఇటీవల ప్రధానో పాధ్యాయుల నుంచి వివరాలను కోరారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, మున్సిపల్‌, కేజీబీవీ, ఏపీ మోడల్‌ స్కూల్‌, జడ్పీ, ట్రైబల్‌ స్కూల్‌ హెచ్‌ఎంలను తమ పాఠశాల విస్తీర్ణం, ల్యాబ్స్‌, లైబ్రరీ, టీచర్లు, పాఠశాలలోని గదులు ఎన్ని ఉన్నాయి, స్కూల్‌ పరిధిలో ప్రైమరీ స్కూల్‌ ఉందా.. తదితర వివరాలన్నీ గూగుల్‌ ఫామ్స్‌లో నింపి, పంపాలని ఆదేశించారు. చాలామంది ప్రధానోపాధ్యాయులు ఇదే పనిలో ఉన్నారు. వచ్చే ఏడాది నుంచే అమలు చేస్తామన్న ధోరణిలో ప్రభుత్వం అడుగు ముందుకేయనున్న నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితిని చూసి నిపుణులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-05-16T05:59:11+05:30 IST