పెద్దాస్పత్రికి భారీగా వస్తున్న కరోనా బాధితులు

ABN , First Publish Date - 2021-05-07T06:38:23+05:30 IST

కరోనా ఉధృతంగా విజృంభిస్తున్న వేళ జిల్లా ధర్మాస్పత్రి కొవిడ్‌ కేంద్రంలో ద యనీయ పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.

పెద్దాస్పత్రికి భారీగా వస్తున్న కరోనా బాధితులు
అనంతపురం ఆస్పత్రిలో మంచాలు లేక నేలపైనే చికిత్సలు

దయనీయం

పెద్దాస్పత్రికి భారీగా వస్తున్న కరోనా బాధితులు 

సరిపోని వసతులు

ఒకే మంచంపై ఇద్దరు ముగ్గురికి చికిత్స

కుర్చీలోనే కొందరికి, నేలపైన

పడుకోబెట్టి మరికొందరికి వైద్యం  

కొవిడ్‌ టెస్ట్‌లకు తప్పని కష్టాలు

వైద్య సిబ్బందిని అంటుకున్న మహమ్మారి

సిబ్బంది కొరతతో తప్పని ఇబ్బందులు

అనంతపురం వైద్యం, మే 5 : కరోనా ఉధృతంగా విజృంభిస్తున్న వేళ జిల్లా ధర్మాస్పత్రి కొవిడ్‌ కేంద్రంలో ద యనీయ పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. పాజిటివ్‌ కేసులు పెరగడంతో చికిత్స కోసం బాధితులు పెద్ద ఎత్తు న ఈ ఆస్పత్రికి తరలివస్తున్నారు. అన్ని విభాగాలు కొవిడ్‌ బాధితులతో కిటకిట లాడుతున్నాయి. ఎక్కడ బెడ్డు ఖాళీ ఉందో తెలియని పరిస్థితి. దీంతో కొవిడ్‌ ఓపీ కేంద్రంలోనే కరోనా బాధితులను ఒక్కో మంచంపై ఇద్దరుముగ్గురిని పడుకోబెట్టి చికిత్స చేస్తున్నారు. మరికొందరిని కుర్చీలు, నేలపైనే ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు. కరోనా బాధి తులు ఓపీ కేంద్రం వద్ద పడుతున్న కష్టాలు చూస్తే ఎవరి కైనా ఎన్ని కష్టాలురా భగవంతుడా అనిపించక మానదు. 




టెస్టింగ్‌లు అరకొరే... తప్పని కష్టాలు

 అనుమానిత లక్షణాలు ఉన్న వారు కొవిడ్‌ పరీక్షలకు ఇక్కడికి వస్తున్నారు. టెస్ట్‌ల కోసం అనేక కష్టాలు పడు తున్నారు. కిట్ల కొరతో మరొకటో తెలీదుగానీ అరకొరగానే జిల్లా కేంద్రంలోని ఆస్పత్రి ఓపీలో కొవిడ్‌ టెస్ట్‌లు చేస్తున్నా రు. అది కూడా కొన్ని ర్యాపిడ్‌ టెస్ట్‌లు చేస్తుండగా మరి కొ న్ని ఆర్‌టీపీసీ టెస్ట్‌లు చేస్తున్నారు. ఎంత మందికి కొవిడ్‌ టెస్ట్‌లు చేస్తున్నారో కూడా ఎవరు చెప్పడం లేదు. కనీసం ఓపీ చీటీలు ఇవ్వరు. టెస్ట్‌కు స మాచారం రాసేందుకు ఫాం ఇవ్వరు. గంటలు తరబడి టెస్ట్‌ల కోసం క్యూలో ఉంటూ కష్టాలు పడాల్సి వస్తోంది. కొందరైతే అనారోగ్యంతో ఉన్న వారు. క్యూలో నిలుచుకోలేక పడిపోతున్నారు. ఫాం ఇచ్చినా ఐడీ రిజిస్ట్రేషన్‌ కోసం గంటలు తరబడి ఉండాల్సి వస్తోంది. ఇలా ప్రతి రోజు జిల్లా స ర్వజనాస్పత్రిలో బాధితులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. వారి కష్టాలు  చూసి కనికరించే వారే కరువయ్యారు. కనీసం ఆ ప్రాంతా నికి వెళ్లి అవసరమైన వసతులు ఏర్పాటు చేసి ఇబ్బందులు తీర్చే అధికారే కాన రాలేదు.  పాలకులు, అధికారులు మీడియాకు ప్రకటనలతోనే సరిపెడుతున్నారు.  



సూపర్‌స్పెషాలిటీ, కేన్సర్‌ యూనిట్‌లోనూ నరకం

కొవిడ్‌ ఆస్పత్రులుగా మార్చిన సూపర్‌ స్పెషాలిటీ కేన్స ర్‌ యూనిట్‌లోనూ బాధితులు నరకం అనుభవిస్తున్నారు. బాధితులు పెరగడంతో కనీస వైద్య సేవలు అందడం లేదు. సమయానికి అల్పాహారం, భోజనం పెట్టడం లేదు.  తాగడానికి గుక్కెడు నీటికి అనేక కష్టాలు పడుతున్నారు. అధికారులకు బాధితుల ఆర్తనాదాలు పట్టడం లేదు. వైద్యులు, సిబ్బంది అనేక మంది కరోనా బారిన పడటంతో సేవలు అందించేవారు కరువయ్యారు. జిల్లా ఆస్పత్రిలో దాదాపు 40 మంది, సూపర్‌ స్పెషాలిటీలో 15 మంది, కేన్సర్‌ యూనిట్‌లో దాదాపు 10 మంది వరకు వైద్యులు, వైద్య సిబ్బంది కరోనా బారిన పడినట్లు చెబుతున్నారు. దీంతో ఉన్న వారే బాధితులకు చికిత్సలు అందించాల్సి వ స్తోంది. అందుకే సేవలు అందక కరోనా బాధితులు అనేక సమస్యలతో అల్లాడిపోతున్నారు. 










కొవిడ్‌ కేంద్రంలోనే కోటంక మహిళ మృతి

అనంతపురం వైద్యం, మే 6: ఆయాసమని ఆస్పత్రికి వస్తే ఊపిరి ఆగింది. అది కూడా ఆస్పత్రి కేంద్రంలోనే. ఈ ఘటన గురువారం రాత్రి జిల్లా ఆస్పత్రి కొవిడ్‌ ఓపీ లో జరిగింది. గార్లదిన్నె మండలం కోటంక గ్రామా నికి చెందిన వన్నూరమ్మ(59) ఆయాసంతో బాధ పడుతుండగా కుటుంబ సభ్యులు మధ్యాహ్నం జిల్లా ఆస్పత్రి కొవిడ్‌ సెంటర్‌కు తీసుకొచ్చారు. అయితే సకాలంలో బెడ్డు దొరకలేదు.  ఆమె పరిస్థితి చూసి అక్కడ ఉన్న డాక్టర్‌ అప్పటికే ఒక బాధితుడున్న మంచంపైనే ఉంచి ఆక్సిజన్‌ అందించే ప్రయత్నం చేశారు.  ఒక్కొక్కరికి కొంచెం సేపు ఆక్సిజన్‌ పెట్టడం వల్ల వన్నూరమ్మ కోలుకోలేకపోయింది. తీవ్ర అస్వస్థతకు గురై అయాసం పెర గడంతో రాత్రి 8 గంటల సమయంలో ఊపిరి ఆగి చనిపోయింది.  

Updated Date - 2021-05-07T06:38:23+05:30 IST