Abn logo
Jun 18 2021 @ 01:05AM

359 మందికి కరోనా

- మరో నలుగురు మృతి

అనంతపురం వైద్యం, జూన్‌ 17: జిల్లాలో గడిచిన 24 గంటల్లో 6592 శాంపిళ్లు పరీక్షించగా 359 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. 5.44 శాతం పాజిటివ్‌ రేటు నమోదైంది.  కరోనాతో చికిత్స పొందుతున్న మరో నలుగురు బాధితులు మరణించారు. జిల్లాలో ఇప్పటి వరకు 151005 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 148272 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. 1018 మంది మరణించారు. ప్రస్తుతం 1715 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు గురువారం వెల్లడించారు.