కొనసాగుతున్న వైరస్‌ దాడి

ABN , First Publish Date - 2021-05-19T06:32:29+05:30 IST

జిల్లాపై కరోనా వైరస్‌ దాడి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 2804 పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు అధికారులు మం గళవారం వెల్లడించారు.

కొనసాగుతున్న వైరస్‌ దాడి
జిల్లా సర్వజనాస్పత్రి కొవిడ్‌ ఓపీలో తగ్గని రద్దీ

ఒక్క రోజులో 2804 కరోనా కేసులు

మరో 8 మంది బలి

జిల్లా ఆస్పత్రికి బాధితుల తాకిడి

బెడ్ల కోసం తప్పని పడిగాపులు

ఆక్సిజన్‌ అందక అవస్థలు

అనంతపురం వైద్యం, మే 18: జిల్లాపై కరోనా వైరస్‌ దాడి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 2804 పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు అధికారులు మం గళవారం వెల్లడించారు. మహమ్మారికి మరో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 119115కి పెరిగింది. ఇందులో 101677 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. 801 మంది మరణించారు. ప్రస్తుతం 16637 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు బులెటిన్‌లో వెల్లడించారు. జిల్లా సర్వజనాస్పత్రి మంగళవారం కూడా కరోనా బాధితులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి రాత్రి వరకు బాధితులు వి విధ వాహనాల్లో వస్తూనే కనిపించారు. బాధితులకు సకాలంలో బెడ్లు, ఆక్సిజన్‌ అందక అవస్థలు పడ్డారు. కొందరు మంచాల కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తూ కనిపించారు. ఆక్సిజన్‌ కోసం మరికొందరు ప్రా ణాలు బిగపట్టుకొని ఎదురుచూశారు. ఇంకొందరు నేలపైనే పడిపోగా అక్కడికే వైద్యులు, సిబ్బంది వెళ్లి పల్స్‌ చూస్తూ చికిత్స అందిస్తూ కనిపించారు. మొత్తంమీద బాధితులకు తగ్గట్టుగా వసతులు లేక జిల్లా ఆస్పత్రిలోని కొవిడ్‌ ఓపీ వద్ద అనేకబాధలు పడుతూనే కనిపించారు. 


మండలాల వారీగా కొత్త కేసులు ఇలా..

జిల్లాలో గడిచిన ఒక్కరోజులో 8742 శాంపిళ్లకు పరీక్షలు చేయగా 2804 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ఇందులో అనంతపురం 296, ధర్మవరం 181, హిందూపురం 119, కదిరి 118, పుట్టపర్తి 103, గోరంట్ల 95, పెనుకొండ, కళ్యాణదుర్గం 88, గుత్తి 77, గుంతకల్లు 75, తాడిపత్రి 69, బుక్కపట్నం 63, మడకశిర 62, బత్తలపల్లి 58, సీకేపల్లి, కూడేరు, నల్లమాడ 55, ఓడీసీ 53, నార్పల 52, ఉరవకొండ 47, చిలమత్తూరు, ముదిగుబ్బ 46, యాడికి 39, పెద్దవడుగూరు 38, తలుపుల 37, యల్లనూరు 36, పరిగి 35, సోమందేపల్లి 34, గార్లదిన్నె, కణేకల్లు, కొత్తచెరువు, రాప్తాడు 33, కంబదూరు 29, రాయదుర్గం 27, అమరాపురం, ఆత్మకూరు, పామిడి 26, అమడగూరు, బుక్కరాయసముద్రం, శింగనమల 25, ఎన్‌పీకుంట, విడపనకల్లు 23, రొద్దం 21, లేపాక్షి, నల్లచెరువు, పెద్దపప్పూరు, రొళ్ల 20, వజ్రకరూరు 19, గుడిబండ, తనకల్లు 18, బెళుగుప్ప, కుందుర్పి 16, కనగానపల్లి 15, గాండ్లపెంట, పుట్లూరు 14, బ్రహ్మసముద్రం, తాడిమర్రి 13, రామగిరి 12, డీ.హీరేహాళ్‌ 10, శెట్టూరు 7, బొమ్మనహాళ్‌ 5, గుమ్మఘట్ట 4, అగళి 2 కేసులు నమోదయ్యాయి.





Updated Date - 2021-05-19T06:32:29+05:30 IST